Narendra Modi: భారతదేశం గర్వంతో ఉప్పొంగుతోంది.. ట్రిపులార్ యూనిట్‌పై ప్రధాని ప్రశంసలు.

ఇండియన్‌ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తూ ఆస్కార్‌ అవార్డు అందుకున్న ట్రిపులార్‌కు ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌ను ప్రశంసలతో ముంచెత్తున్నారు...

Narendra Modi: భారతదేశం గర్వంతో ఉప్పొంగుతోంది.. ట్రిపులార్ యూనిట్‌పై ప్రధాని ప్రశంసలు.
Pm Modi
Follow us

|

Updated on: Mar 13, 2023 | 10:41 AM

ఇండియన్‌ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తూ ఆస్కార్‌ అవార్డు అందుకున్న ట్రిపులార్‌కు ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌ను ప్రశంసలతో ముంచెత్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు వారి ఆనందానికి అవధులే లేకుండా పోతోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఇది తెలుగు వారి విజయంగా గర్వపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఆస్కార్‌ అవార్డులపై తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ట్రిపులార్‌ చిత్రయూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్‌ దక్కడంపై ట్వీట్‌ చేసిన ప్రధాని.. ‘ఇది అసాధారణం. నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాట అవుతుంది. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు. భారతదేశం గర్వంతో ఉప్పొంగుతుంది’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక భారత్‌ నుంచి ఆస్కార్‌ దక్కించుకున్న మరో డాక్యుమెంటరీ.. ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌‌ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ప్రకృతితో కలిసి జీవించాల్సిన ప్రాముఖ్యతను చూపించిన విధానం అద్భుతంగా ఉంది అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

ప్రశంసలు కురిపించిన కేసీఆర్, జగన్..

నాటు నాటుకు ఆస్కార్‌ అవార్డు దక్కడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సైతం స్పందించారు. తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా ఖ్యాతి లభించడం ఎంతో గర్వంగా ఉంది అంటూ ట్వీట్‌ చేశారు. నాటు నాటుకు ఆస్కార్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని కేసీఆర్‌ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..