PM Modi Meeting Live: కరోనా విజృంభణ.. కేంద్రం కీలక నిర్ణయం..! సీఎంలతో సంభాషిస్తున్న ప్రధాని మోదీ..

| Edited By: Ravi Kiran

Apr 23, 2021 | 2:51 PM

Modi meeting with Chief Ministers: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లక్షాలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తుండటతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై

PM Modi Meeting Live: కరోనా విజృంభణ.. కేంద్రం కీలక నిర్ణయం..! సీఎంలతో సంభాషిస్తున్న ప్రధాని మోదీ..
Pm Narendra Modi

Modi meeting with Chief Ministers: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లక్షాలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తుండటతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి నేడు ప్రధాని మోదీ మూడు సమావేశాలు ఏర్పాటు చేశారు. అధికారులతో కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే ఆక్సిజన్ సమస్యపై ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు.

అయితే ఈ రోజు ప్రధాని మోదీ వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయం కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో సంభాషించిన అనంతరం రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతున్నారు. 12.30 నిమిషాలకు ఆక్సిజన్‌ తయారీదారులతో ప్రాణ వాయువు ఉత్పత్తిపై చర్చించనున్నారు.

అయితే, ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? కరోనా కట్టడికి సంచలన ప్రకటన ఏమైనా చేసే అవకాశముందా..? అన్నది ఇప్పడు దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు.



Also Read:

India Covid-19: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఒక్క రోజే 2,263 మంది మృతి.. కేసులు ఎన్నంటే..?

కోవిడ్ ఉధృతి, జర్మనీ నుంచి ఇండియాకు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ దిగుమతి

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Apr 2021 12:12 PM (IST)

    ఆక్సిజన్ కొరత.. ఢిల్లీ సీఎంతో ప్రధాని మోదీ సమావేశం..

    ఢిల్లీలో భారీగా ఆక్సిజన్ కొరత ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానితో జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఢిల్లీకి వచ్చే ఆక్సిజన్ ప్లాంట్ కోసం తాను ఎవరితో సంప్రదింపులు జరపాలో తెలపండి అని కేజ్రీవాల్ అడిగారు. 

  • 23 Apr 2021 12:00 PM (IST)

    గంగారాం ఆసుపత్రికి చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్..

    ఆక్సిజన్ ట్యాంకర్ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి చేరుకుంది. అత్యవసర పరిస్థితికి అనుగుణంగా ఆసుపత్రికి కేవలం రెండు గంటల ఆక్సిజన్ నిల్వ మాత్రమే ఉండటంతో చాలామంది రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. 

  • 23 Apr 2021 11:52 AM (IST)

    సీఎంలతో మొదలైన ప్రధాని మోదీ సమావేశం..

    కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం మొదలైంది. కరోనా పరిస్థితులు, ఆక్సిజన్ కొరత లాంటి పలు కీలక విషయాలను చర్చించనున్నారు.

  • 23 Apr 2021 11:48 AM (IST)

    రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ వర్చువల్ మీట్..

    కరోనా కేసులు నమోదవుతున్న అత్యధిక రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

Follow us on