Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: ఐరాస భద్రతా మండలిని విస్తరించాలి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమతి భద్రతా మండలిని వెంటనే విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. అలాగే అన్ని అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవరసరమని చెప్పారు. అలాగే ప్రపంచాన్ని భవ్యమైన భవిష్యత్తు దిశగా నడిపించేందుకు ఆయా సంస్థలు కొత్త వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని సూచనలు చేశారు. అలాగే కాలానుగుణంగా మార్పులకు లోనుకానివి వాటి సమకాలినతను కోల్పోతున్నట్లు వివరించారు.

G20 Summit: ఐరాస భద్రతా మండలిని విస్తరించాలి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Pm Modi
Follow us
Aravind B

|

Updated on: Sep 11, 2023 | 2:13 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమతి భద్రతా మండలిని వెంటనే విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. అలాగే అన్ని అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవరసరమని చెప్పారు. అలాగే ప్రపంచాన్ని భవ్యమైన భవిష్యత్తు దిశగా నడిపించేందుకు ఆయా సంస్థలు కొత్త వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని సూచనలు చేశారు. అలాగే కాలానుగుణంగా మార్పులకు లోనుకానివి వాటి సమకాలినతను కోల్పోతున్నట్లు వివరించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా వన్ ఫ్యూచర్ సెషల్‌లో ప్రధాని ప్రసగించారు. ఆ తర్వాత సదస్సు ముగింపు కార్యక్రమంలోనూ మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థలు ఏవైనా కూడా ఇప్పటి అవసరాలను తీర్చే విధంగా ఉండాలని అన్నారు. అలాగే ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనప్పడు ఉన్న పరిస్థితులు వేరు.. ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు అని అన్నారు.

ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డ కొత్తలో కేవలం 51 సభ్య దేశాలు మాత్రమే ఉండేవని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 200 కు చేరుకుందని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే భద్రతా మండలిని విస్తరించాలని పేర్కొన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని.. కానీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాల సంఖ్యలో ఎలాంటి మార్పులు జరగలేదని తెలిపారు. అలాగే ఐక్యరాజ్యసమితితో పాటుగా ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేయాల్సని అవసరాన్ని ఆయన వివరించారు. అలాగే ఈ ఏడాది నవంబర్ నెల చివరన జీ20 సదస్సును వర్చువల్‌గా నిర్వహించుకుందామని ప్రతిపాదన చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి సదస్సులో తీసుకున్న నిర్ణయాలతో సహా.. ఇతర అంశాలపై మరోసారి సమీక్ష చేద్దామని అన్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.

అలాగే అవి వర్తమానాన్ని, భవిష్యత్తును ఇవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయని అన్నారు. అలాగే క్రిప్టో కరెన్సీలను క్రమబద్ధీకరించడానికి అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేయాలని అన్నారు. ఇవి భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుకొనేందుకు సైబర్ స్పేస్ అనేది ఒక కొత్త వనరుగా ఆవిర్భవించినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు జీడీపీ కేంద్రిత ప్రయాణానికి కాలం చెల్లినట్లు ప్రధాని అన్నారు. అలాగే మానవ కేంద్రిత అభివృద్ది కోసం మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైనట్లు తెలిపారు. అలాగే ఆ దిశగా తాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో సామాజిక, ఆర్థిక ప్రగతికి ఉపయోగించాలని సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..