PM Modi: ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన ప్రధాని మోడీ.. పీఎం కేర్స్ కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఓ వరం..

దేశవ్యాప్తంగా 35 PSA ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఉత్తరాఖండ్​ రిషికేశ్​ ఎయిమ్స్​లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు..

PM Modi: ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన ప్రధాని మోడీ.. పీఎం కేర్స్ కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఓ వరం..
Pm Modi
Follow us
Sanjay Kasula

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 07, 2021 | 2:38 PM

దేశవ్యాప్తంగా 35 PSA ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఉత్తరాఖండ్​ రిషికేశ్​ ఎయిమ్స్​లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీఎం కేర్స్ కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పీఎం కేర్స్​ నిధులతో మొత్తం 1,224 ఆక్సిజన్ ప్లాంట్లకు నిధులు సమకూర్చారు. వీటిలో 1,100కు పైగా ప్లాంట్లలో రోజుకు 1,750 ఎంటీల ఆక్సిజన్ ఉత్పత్తి జరిగింది.

ఇక త్వరలోనే వందకోట్ల మందికి వ్యాక్సినేషన్‌ మైలురాయిని చేరుకోనున్నట్టు తెలిపారు ప్రధాని మోదీ. కొవిన్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టి ప్రపంచానికి భారత్‌ ఓ మార్గాన్ని చూపించిందన్నారు. అతి తక్కువ సమయంలోనే వైద్య సదుపాయాలు కల్పించి భారత్‌ తన సామర్థ్యాన్ని చాటిందన్నారు. అన్ని రంగాల్లో ఎగుమతుల దిశగా భారత్‌ దూసుకెళ్తోందని వెల్లడించారు.

రిషికేశ్: త్వ‌ర‌లోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ మైలురాయిని చేరుకోనున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఇవాళ రిషికేశ్‌లో ఆయ‌న ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా 35 ప్రెజ‌ర్ స్వింగ్ అబ్జార్పాన్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఆయ‌న జాతికి అంకితం చేశారు. పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ప్రారంభించారు. కోవిన్‌ ఫ్లాట్‌ఫామ్ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టి ప్ర‌పంచానికి భార‌త్ ఓ మార్గాన్ని చూపించింద‌ని అన్నారు.

అతి త‌క్కువ స‌మ‌యంలోనే వైద్య స‌దుపాయాలు క‌ల్పించి భార‌త్ త‌న సామ‌ర్థ్యాన్ని చాటింద‌న్నారు. మూడు వేల టెస్టింగ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేశామ‌ని, మాస్క్‌ల‌ను దిగుమ‌తి చేసేవాళ్ల‌మ‌ని, కానీ ఇప్పుడు ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. అన్ని రంగాల్లో ఎగుమ‌తి చేసే దిశ‌గా భార‌త్ దూసుకువెళ్లుంద‌ని ప్ర‌ధాని చెప్పారు.

దేశ‌వ్యాప్తంగా 92 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మన్సూక్ మాండ‌వీయ తెలిపారు. ఇక ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో 95 శాతం మంది వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఇవి కూడా చదవండి: Converting air to water: కూలర్ ధరకే గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే మిషన్.. ధర ఎంతో తెలుసా..

IT Department Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐటి డిపార్ట్‌మెంట్ 21 ఖాళీలు.. ఇప్పుడే.. ఇలా అప్లై చేయండి..