Yashwant Sinha: నేడే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా నామినేషన్.. హాజరుకానున్న కేటీఆర్..

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా ఈరోజు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Yashwant Sinha: నేడే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా నామినేషన్.. హాజరుకానున్న కేటీఆర్..
Yashwant Sinha
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 27, 2022 | 8:33 AM

Presidential Election 2022: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా ఈరోజు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సిన్హా ఎంపికైన విషయం తెలిసిందే. సిన్హా సమర్ధుడైన అడ్మినిస్ట్రేటర్‌గా, నిష్ణాతుడైన పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా పలు హోదాల్లో సేవలందించారు. ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. కాగా.. అంతకుముందు పార్లమెంట్‌ అనెక్స్‌లో విపక్షనేతలంతా భేటీ కానున్నారు. దీంతోపాటు యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత విపక్షాల నేతలంతా యశ్వంత్‌ సిన్హాతో కలిసి ర్యాలీగా బయలుదేరి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ కార్యాలయానికి చేరుకోనున్నారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి.. 12 గంటల 15 నిమిషాలకు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు యశ్వంత్‌ సిన్హాతో కలిసి విపక్షనేతలంతా మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

టీఆర్ఎస్ నుంచి కేటీఆర్.. 

కాగా.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్‌ సీన్‌ తెరపైకి వచ్చింది. ఢిల్లీలో విపక్షాల మీటింగ్‌కి హాజరుకాని టీఆర్‌ఎస్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హాకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యశ్వంత్‌ సిన్హాకు సపోర్ట్‌గా టీఆర్‌ఎస్ బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకు తన నిర్ణయాన్ని డైరెక్ట్‌గా ప్రకటించని టీఆర్‌ఎస్‌ ఇప్పుడు సడన్‌గా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ప్రకటించడం సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

అంతకుముందు రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపికపై ఢిల్లీలో విపక్షాల మీటింగ్‌ నిర్వహించారు బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ. ఈ సమావేశానికి అన్ని విపక్షాలతోపాటు టీఆర్‌ఎస్‌ను కూడా పిలిచారు. సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడారు. అయితే, ఈ మీటింగ్‌ టీఆర్‌ఎస్ డుమ్మా కొట్టడంతో గులాబీ పార్టీ స్టాండ్‌ ఏంటో తెలియక గందరగోళం ఏర్పడింది. యశ్వంత్‌ నామినేషన్‌ రోజు, మద్దతుగా నిర్ణయం తీసుకోవడం, కేటీఆర్ బృందం ఢిల్లీ వెళ్లడం ఇంట్రెస్టింగ్‌ మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..