AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రపతి ఎన్నికలు 2022: వీల్ చైర్‌పై వచ్చి ఓటు వేసిన మన్మోహన్ సింగ్ – Viral Video

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌పై పార్లమెంటుక వస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రాష్ట్రపతి ఎన్నికలు 2022: వీల్ చైర్‌పై వచ్చి ఓటు వేసిన మన్మోహన్ సింగ్ - Viral Video
Ex-PM Manmohan SinghImage Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Jul 18, 2022 | 7:24 PM

Share

Manmohan Singh Viral Video: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మాజీ ప్రధాని, కాంగ్రెస్ ఎంపీ మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌పై పార్లమెంటుకు వచ్చి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌పై పార్లమెంటుక వస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్లమెంటు సెకండ్ ఫ్లోర్‌లోని 63వ గదిలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ పోలింగ్ బూత్‌లో మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నలుగురు సిబ్బంది వీల్ చైర్‌పై ఉన్న మన్మోహన్ సింగ్ ఓటు వేసేందుకు సహకరించారు.

అనారోగ్యంతో గత అక్టోబర్ మాసంలో మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. 18 రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శారీరకంగా బలహీనంగా ఉండటంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలకు మన్మోహన్ సింగ్ హాజరుకాలేదు. 2009లో ఎయిమ్స్‌లో మన్మోహన్ సింగ్‌కు బైపాస్ సర్జరీ జరిగింది. గత ఏడాది ఏప్రిల్ మాసంలో కరోనా బారినపడిన ఆయన ఆస్పత్రిలో చేరి కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన వయస్సు 89 ఏళ్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి