Presidential Elections 2022: ఎవరికి వారే యమునా తీరే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం ఎండమావేనా..?
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాల కసరత్తు ప్రారంభమైంది. ఇవాళ దీనికి సంబంధించి బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు మమతా బెనర్జీ శ్రీకారం చుట్టారు.
16వ రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. బీజేపీని నిలువరిస్తామని చెప్తున్న విపక్షాలకు తమ శక్తిని చాటిచెప్పేందుకు ఇదో గొప్ప అవకాశం. అంతే కాదు వరుస ఓటములు, ఈడీ విచారణలతో తల్లడిల్లుతున్న కాంగ్రెస్‌కు ప్రతిపక్షంగా తనది బలమైన స్థానమని చెప్పుకునేందుకు తన హోదాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదిరిని కలిపి తన సత్త నిరూపించుకునేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాల కసరత్తు ప్రారంభమైంది. ఇవాళ దీనికి సంబంధించి బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు.
మమతా పిలుపు మేరకు విపక్ష నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి 17 పార్టీల నేతలు హాజరయ్యారు. ఎన్సీపీ నుంచి పార్టీ అధినేత శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది, లెఫ్ట్ నుంచి దీపాంకర్ భట్టాచార్య, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, పీడీపీ నుంచి పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నుంచి రణదీప్ సూర్జేవాలా, జైరాం రమేశ్ ఖర్గే, SP నుంచి పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, RLD నుంచి జయంత్ చౌదరి, DMK నుంచి TR బాలు సమావేశంలో పాల్గొంటున్నారు.
ఈ పార్టీలు.. తెలుగు దేశం పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ (BSP), ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) వంటి కొన్ని పార్టీలను మమతా ఆహ్వానించలేదు. ప్రత్యేక ఆహ్వానించినప్పటికీ కొన్ని పార్టీలు రాలేదు. అయితే ఈ సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, బీజేడీ, అకాలీదళ్‌లకు దూరంగా ఉంటున్నాయి.
ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థి కోసం కొందరి పేర్లను కూడా పరిశీలించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సమావేశంలో వచ్చిన పేర్లను మరింత పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చు. దీనికి శరద్ పవార్ లేదా మరో సీనియర్ నేతను ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది. గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును లెఫ్ట్ పార్టీలు సూచించాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఆసక్తి చూపించడం లేదు.
విజయం అంచున..!
ఎలక్టోరల్ కాలేజీలో దాదాపు సగం ఓట్లు అధికార ఎన్‌డిఎకు ఉన్నాయి. బీజేడీ, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK), యువజన్ శ్రామిక్ రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) వంటి పార్టీల మద్దతును పొందినట్లయితే దాని అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించవచ్చు.అయితే.. రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిని ప్రదర్శించడానికి ప్రతిపక్షాల ప్రయత్నాల మధ్య కొంతమంది నాయకులు ప్రత్యామ్నాయంగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని సంప్రదించారు. గాంధీ 2017లో ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి. అయితే ఆ ఎన్నికల్లో వెంకయ్యనాయుడు చేతిలో ఓడిపోయారు.
అయితే అన్ని పార్టీలో ఎన్డీఏ నేతలు మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేతో ఈ విషయంపై ఫోన్లో మాట్లాడారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఖర్గేకు సూచించారు రాజ్‌నాథ్‌సింగ్. అయితే విపక్షాలు వివాదరహితుడైన వ్యక్తి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదిస్తామని బీజేపీ మద్దతిస్తుందా ? అని రాజ్‌నాథ్‌ను అడిగారు ఖర్గే. అయితే ఇద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలు తెలియాల్సి ఉంది.
జులై 21న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. విపక్షాల సమావేశానికి 22 పార్టీలను ఆహ్వానించారు మమత. అయితే ఐదు పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.