మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. ఛతీస్‌గఢ్ సీఎంకు చురకలంటించిన ప్రహ్లాద్ జోషి..
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతోన్న టైమ్‌లో ఈడీ దాడులు సంచలనాలకు క్యూ కడుతున్నాయి. పోలింగ్ ముంగిట్లో బెట్టింగ్ యాప్ స్కామ్ చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ సర్కార్‌ను షేక్ చేసింది. చత్తీస్‌గడ్ సీఎం భూపేష్ బఘేల్‌కు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ. 508 కోట్ల ముడుపులు అందాయని ఈడీ చేసిన సంచలన ఆరోపణ.. దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్‌ను పెంచేసింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతోన్న టైమ్‌లో ఈడీ దాడులు సంచలనాలకు క్యూ కడుతున్నాయి. పోలింగ్ ముంగిట్లో బెట్టింగ్ యాప్ స్కామ్ చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ సర్కార్‌ను షేక్ చేసింది. చత్తీస్‌గడ్ సీఎం భూపేష్ బఘేల్‌కు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ. 508 కోట్ల ముడుపులు అందాయని ఈడీ చేసిన సంచలన ఆరోపణ.. దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్‌ను పెంచేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పిల్లల ఆటగా చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కొట్టిపారేస్తే.. ‘మహాదేవ్ బెట్టింగ్ యాప్ – 508కోట్ల ముడుపుల’ వ్యవహారాన్ని కోట్ చేస్తూ.. కాంగ్రెస్‌కు చురకలంటిస్తున్నారు బీజేపీ నేతలు.. ఈ తరుణంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వివరణాత్మక ప్రకటన ఇచ్చారన్నారు ప్రహ్లాద్ జోషి. ఈ కేసులో పట్టుబడిన నిందితుడు.. తాను ఛత్తీస్‌గఢ్ సీఎంకు రూ. 5 కోట్లు డెలివరీ చేసినట్లుగా ఒప్పుకున్నాడని.. అంతేకాకుండా ఆ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎంకు డబ్బులు ఇచ్చారని ఆరోపించాడన్నారు’ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. ‘మొదట ఈ కేసులో సదరు నిందితుడు సీఎంకు రూ. 5 కోట్లు ఇచ్చారని ఆరోపణ వచ్చిందని.. ఆ తర్వాత అది రూ.500 కోట్లుకు మారిందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఇలాంటి సందర్భంలో ఈ కేసుపై విచారణ జరగాలా.? వద్దా.? ఈడీ స్టేట్‌మెంట్ ఏంటి.? అసలు కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ దగ్గరకు ఎలాంటి డిమాండ్ తీసుకెళ్తోంది.? అవినీతి, కుంభకోణం ఏం జరిగినా కూడా.. తమపై విచారణ జరపొద్దని ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయబోతున్నారా? అంటూ ప్రశ్నించారు ప్రహ్లాద్ జోషి. ఎన్నికల కమిషన్ ముందు ఆ పార్టీ ఏం చెప్పబోతున్నారోనన్నది తనకే కాదు.. సామాన్యులకు కూడా అర్ధం కావట్లేదని దుయ్యబట్టారాయన. తాను ఛతీస్‌గడ్ సీఎంను ఒకటే అడగాలని అనుకుంటున్నాను. ఒకవేళ సదరు నిందితులు డబ్బులు ముఖ్యమంత్రి వద్దకు చేరాయని ఆరోపిస్తుంటే.. దీనిపై దర్యాప్తు చేయాలా.? వద్దా.? మీరేమంటారంటూ భూపేష్ బఘేల్‌ను ప్రశ్నించారు కేంద్రమంత్రి.
#WATCH | Jaipur, Rajasthan: On Mahadev betting app case, Union Minister Pralhad Joshi says, “Our colleague Smirit Irani gave a detailed statement on it yesterday. The accused that is caught has said that he has delivered Rs. 5 crores to the (Chhattisgarh) CM. He alleged that the… pic.twitter.com/Vbp7laQbIa
— ANI (@ANI) November 6, 2023
అసలేం జరిగిందంటే..
ఆసిమ్‌దాస్ అనే వ్యక్తి దాదాపు రూ. 6 కోట్లను బట్వాడా చేస్తూ ఈడీకి పట్టుపట్టాడు. ఎన్నికల్లో ఖర్చు కోసం బెట్టింగ్ యాప్ నిర్వాహకులు సీఎం భూపేష్‌కు రూ. 508 కోట్లు చెల్లించారని కొరియర్ దాస్ ఆసిమ్‌దాస్ చెప్పాడని ఈడీ పేర్కొంది. కూపీ లాగితే మహేదవ్ బెట్టింగ్ నెట్‌వర్క్ ఆర్గనైజర్స్ డేటా బయటకు వచ్చింది. వారిలో ఒకరైన శుభ్ సోని ఈ-మెయిల్స్‌ను చెక్ చేస్తే డొంక కదిలిందనేది ఈడీ వెర్షన్. సదరు కొరియర్ ఇచ్చిన సమాచారంతో పలు హోటల్స్‌లో తనిఖీలు నిర్వహించిన ఈడీ టీమ్స్ భారీగా క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నాయి.
ఈ మొత్తం వ్యవహారాన్ని పిల్లల ఆటగా కొట్టిపారేశారు చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్. ఎవడో దొరకడం ఏంటీ.. అతను చెప్పడాన్ని తనపై నింద మోపడం ఏంటి అని ప్రశ్నించారాయన. బట్టకాల్చి మీదేయడం అంతా సులభం మరోటి ఉండదన్నారు. ఎవరో కోన్ కిస్కా వచ్చి ప్రధానిపై ఆరోపణలు చేస్తే ఈడీ దర్యాప్తు చేస్తుందా? అని ప్రశ్నించారు బగేల్. 508 కోట్ల ముడుపుల ముచ్చట శుద్ద అబద్దం అన్నారు . శుభమ్ సోని ఎవరో తనకూ తెలియదన్నారాయన. ఆడెవడో నాకు తెల్వద్… సారు ఇలా అన్నారో లేదో ఏకంగా శుభమ్ సోని బిగ్ బ్రేకింగ్స్‌లో తెరపై తళుక్కుమన్నారు. బెట్టింగ్ యాప్ యాక్టివిటీ కోసం సీఎం భూపేష్ తనను ప్రొత్సహించారని.. ప్రతిఫలంగా 508 కోట్లు చెల్లించాలనన్నాడు. నిజానికి బెట్టింగ్ యాప్ దందాకు ఆయనే ఓనర్ అంటూ సీఎం బఘేల్‌పై ఆరోపణలు చేశాడు శుభమ్ సోని.
బిలాయ్‌లో తమ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన క్రమంలో తనను విదేశాలకు పారిపోవాలని సాక్షాత్ సీఎం భూపేష్ బగాలే సలహా ఇచ్చారన్నారు. తనను కాపాడాలని అభ్యర్థిస్తూ ఓ వీడియో చేశాడు శుభమ్ సోనీ. ఆ వీడియోను బీజేపీ నేత సిద్ధార్థ్ సింగ్ మీడియాకు రిలీజ్ చేశారు. మరోవైపు రీసెంట్‌గా దుర్గానగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ -508కోట్ల ముడుపుల వ్యవహారాన్ని కోట్ చేస్తూ.. కాంగ్రెస్‌కు చురకలంటించారు. 508 కోట్ల వెనుక అసల కతేంటో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారాయన. కాంగ్రెస్ అంటే కమీషన్ అంటూ సెటైర్లు వేశారు ..టాకా కక్కా, ఆప్కా కామ్ పక్కా .. డబ్బులిస్తే దేనికైనా రెడీ అనే టైపు కాంగ్రెస్‌దని గాలి తీశారాయన.
