WITT: టీవీ9 కాన్క్లేవ్లో నక్షత్ర అవార్డు అందుకున్న ప్రముఖ నటి రవీనా టాండన్.. కీలక విషయాలు వెల్లడి..
టీవీ9 న్యూస్ నెట్‌వర్క్ నిర్వహించిన 'వాట్ ఇండియా థింక్ టుడే' కార్యక్రమంలో నటి రవీనా టాండన్ పాల్గొన్నారు. ఆమె నటించిన అద్భుతమైన చిత్రాలకు గాను నక్షత్ర అవార్డును అందుకున్నారు. సినీ పరిశ్రమలో ఆమె సాధించిన విజయాలు, సేవలకు గుర్తింపుగా రవీనా టాండన్‌కు 'నక్షత్ర అవార్డు' లభించింది. అవార్డు అందుకున్న తర్వాత రవీనా టాండన్ 'వాట్ ఇండియా థింక్ టుడే' చర్చలో పాల్గొని చిత్ర పరిశ్రమ గురించి తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు.
టీవీ9 న్యూస్ నెట్‌వర్క్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్ టుడే’ కార్యక్రమంలో నటి రవీనా టాండన్ పాల్గొన్నారు. ఆమె నటించిన అద్భుతమైన చిత్రాలకు గాను నక్షత్ర అవార్డును అందుకున్నారు. సినీ పరిశ్రమలో ఆమె సాధించిన విజయాలు, సేవలకు గుర్తింపుగా రవీనా టాండన్‌కు ‘నక్షత్ర అవార్డు’ లభించింది. అవార్డు అందుకున్న తర్వాత రవీనా టాండన్ ‘వాట్ ఇండియా థింక్ టుడే’ చర్చలో పాల్గొని చిత్ర పరిశ్రమ గురించి తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు.
టీవీ9 నెట్‌వర్క్ ‘వాట్ ఇండియా థింక్ టుడే’ కార్యక్రమంలో నటి రవీనా మాట్లాడుతూ.. తాను నటించడం ప్రారంభించినప్పుడు సినీ పరిశ్రమలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, సినిమా రంగంలో మహిళల పరిస్థితి, సినిమాల విషయంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు ఎలా ఉందో వివరించారు. రవీనా టాండన్ తన పెంపకంతో పాటు కుటుంబ నేపథ్యం గురించి కూడా మాట్లాడారు. తన తండ్రి తనను కొడుకులా పెంచాడని గర్వంగా చెప్పుకున్నారు. సినీ పరిశ్రమలో అందరు నటీమణులు ఒకే తరహా సినిమాలు చేస్తున్నప్పుడు తాను విభిన్నమైన పంథాలో పయనించానని చెప్పుకొచ్చారు. తనలోని ప్రతిభను కళాత్మక చిత్రాల ద్వారా బయటకు తీసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత OTT, ఇంటర్నెట్ యుగం ప్రభావంతో చిత్ర పరిశ్రమ మారిన తీరు గురించి మాట్లాడుతూ, నటీమణులు కూడా ఈ రోజు చిత్రానికి ‘హీరో’గా మారగలరని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..