AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కోవిడ్ పీరియడ్’ లో స్వీట్ల హంగామా, యూపీలో 20 కేజీల రసగుల్లాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

దేశాన్ని కుదిపేస్తున్న కోవిడ్ 'పీరియడ్' లో స్వీట్ల హంగామాకూడా జోరుగానే సాగింది. యూపీలో ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఇద్దరు విజేతలు తమ ఆనందాన్ని పంచుకోవడానికి...

'కోవిడ్ పీరియడ్' లో స్వీట్ల హంగామా, యూపీలో 20 కేజీల రసగుల్లాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Police In Up Seized 20 Kgs Rasagullas
Umakanth Rao
| Edited By: Ravi Kiran|

Updated on: May 06, 2021 | 3:03 PM

Share

దేశాన్ని కుదిపేస్తున్న కోవిడ్ ‘పీరియడ్’ లో స్వీట్ల హంగామాకూడా జోరుగానే సాగింది. యూపీలో ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఇద్దరు విజేతలు తమ ఆనందాన్ని పంచుకోవడానికి ప్రజలకు రసగుల్లాల ‘పంపిణీ’ కార్యక్రమాన్ని చేబట్టారు. కోవిడ్ రూల్స్ ని అతిక్రమించి వీరు రసగుల్లాలకోసం పెద్ద ఎత్తున ఎగబడిన వారికి వీటిని పంచుతూ ఖాకీలకు పట్టుబడిపోయారు. మొత్తం 20 కేజీల రసగుల్లాలను పోలీసులు వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. 144 సెక్షన్ ను ఉల్లంఘించి వీరిద్దరూ ఇలా స్వీట్లను పంచారని, అందుకే వీరిని అదుపులోకి తీసుకున్నామని హాపూర్ పోలీసులు తెలిపారు. హాపూర్ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఈ ఇద్దరి సంబరం ఇలా నీరుగారిపోయింది. ఈ ‘సీజన్’ లో ఒకే చోట అయిదుగురు లేదా అంతకన్నా ఎక్కువమంది గుమికూడరాదన్నది రూల్.. కానీ వీళ్ళు ఆ రూల్స్ ని పాతరేశారు. కోవిడ్ మహమ్మారి జడలు జాచినవేళ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచినవారెవరూ విజయోత్సవాలను జరుపుకోరాదని ఈసీ నిషేధం విధించింది. కానీ దేశంలో పలు చోట్ల పార్టీల కార్యకర్తలు తమ ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించగానే ఈ పార్టీ వారంతా కోల్ కతా లో పార్టీ కార్యాలయం వద్దకుచేరి.. పార్టీ పతాకాలతో హంగామా చేశారు. ఎవరూ సెలబ్రేషన్స్ జరపరాదని తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపును కూడా బేఖాతరు చేశారు.

ఇక తమిళనాడు కూడా ఈ విషయంలో మినహాయింపేమీ కాదు. తమ పార్టీ విజయంతో డీఎంకే కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పదేళ్ల తరువాత రాష్ట్రంలో తిరిగి డీఎంకే అధికారంలోకి వస్తున్నందుకు పెద్ద సంఖ్యలో మహిళలతో సహా వందలాది మంది పార్టీ కార్యాలయం వద్ద డ్యాన్సులు చేశారు. కేరళలో ఎల్ డీ ఎఫ్ సభ్యులు కూడా తమ ఉత్సాహాన్ని అణచుకోలేక కొద్దో గొప్పో సెలబ్రేషన్స్ నిర్వహించారు.

మరిన్ని చదవండి ఇక్కడ :  ఐడియా అదుర్స్‌ రైతన్న వినూత్న ప్రయోగం వైరల్ అవుతున్న వీడియో ..: Farmer Creative Viral Video.

ఊరు ఊరంతా ఐసోలేషన్‌!ఐసొలేషన్ పాటిస్తూ పొలాల్లో ఉంటున్న సగం ఊరి జనం వీడియో… : viral video.