AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి పై పోలీసు కేసు…సోదరునిపై కూడా …ఎందుకంటే …?

బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి, ఆయన సోదరుడు సౌమెందు అధికారిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. కోల్ కతాకు సుమారు 150 కి.మీ. దూరంలోని పూర్బా మెడినిపూర్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం నుంచి వీరు లక్షల రూపాయల..

బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి పై పోలీసు కేసు...సోదరునిపై కూడా ...ఎందుకంటే ...?
Suvendu Adhikari
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 06, 2021 | 11:39 AM

Share

బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి, ఆయన సోదరుడు సౌమెందు అధికారిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. కోల్ కతాకు సుమారు 150 కి.మీ. దూరంలోని పూర్బా మెడినిపూర్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం నుంచి వీరు లక్షల రూపాయల విలువైన సహాయ సామాగ్రిని దొంగిలించుకుపోయారని ఆరోపణలు వచ్చాయి. కాంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డు సభ్యుడైన రత్న దీప్ మన్నా అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని ఖాకీలు వీరిపై కేసు పెట్టారు. గత నెల 29 న సువెందు అధికారి, ఆయన సోదరుడు, మాజీ మున్సిపల్ కమిషనర్ కూడా అయిన సౌమెందు అధికారి మున్సిపల్ కార్యాలయం గోడౌన్ తాళాలు పగులగొట్టి అందులోని లక్షల రూపాయల విలువైన సహాయ సామాగ్రిని, ట్రక్కు లోడ్ టార్పాలిన్ తదితరాలను బలవంతంగా తీసుకుపోయారని, పైగా ఇందుకు..తమ సెక్యూరిటీగా ఉన్న కేంద్ర దళాలను కూడా వినియోగించుకున్నారని మన్నా ఆరోపించారు. ఈ సామాగ్రిని నందిగ్రామ్ లో తుపాను బాధితులకు అందజేశారని తెలుస్తోంది. కాగా ఓ చీటింగ్ కేసులో సువెందు అధికారికి సన్నిహితుడైన రఖల్ బేరా అనే వ్యక్తిని అరెస్టు చేసిన రోజే ఈ కేసు దాఖలైంది. 2019 లో ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఈయన 2 లక్షల రూపాయల లంచం తీసుకున్నాడట.. ఆ వ్యక్తికి జాబ్ మాత్రం రాలేదు.

ఇలా ఉండగా తాజా పరిణామాలపై సువెందు అధికారి గానీ, ఆయన సోదరుడు గానీ స్పందించలేదు.ఈ కేసు వ్యవహారం బెంగాల్ లో సంచలనమైంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ నేతలు దీనిపై ఏమంటారో చూడాలి.. ఒకప్పుడు సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడై ఆ తరువాత బీజేపీలో చేరిన సువెందు అధికారి ఇలాంటి చర్యకు పాల్పడ్డారంటే ఆయన అభిమానులు నమ్మలేకపొతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Today Gold Rate, Silver Price Video: పసిడిప్రియులకు కాస్త ఊరట. గత కొద్దిరోజులుగా తగ్గుతూ పెరుగుతున్నా బంగారం ధరకు బ్రేక్.

కోయంబత్తూర్‌లోని వాల్పరైలో ఏనుగు బీభత్సం.. తేయాకు తోటపై విరుచుకుపడిన గజరాజు :Elephant viral video.

హిమాచల్ ప్రదేశ్ శివాలిక్ కొండల్లో కనిపించిన అరుదైన ,అతి విషపూరితమైన కింగ్ కోబ్రా : King Cobra Video

ఈ పిల్లి చేష్టలు చుస్తే నవ్వాపుకోలేరు..వేరే పిల్లిని పిలుస్తున్న యజమానిపై ఓ పిల్లి కోపం:Cat Viral Video

Follow Us