‘ఆత్మ నిర్భర్’ కు కొత్త నిర్వచనాన్ని ప్రకటించనున్న మోదీ, రాజ్ నాథ్ సింగ్

భారత స్వావలంబనకు ప్రధాని మోదీ ఈ నెల 15 న స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొత్త ' నిర్వచనాన్ని' ప్రకటిస్తారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. మహాత్ముడు ప్రవచించిన 'స్వదేశీ' నినాదాన్ని మరింత ముందుకు...

  • Umakanth Rao
  • Publish Date - 10:57 am, Mon, 10 August 20
'ఆత్మ నిర్భర్' కు కొత్త నిర్వచనాన్ని ప్రకటించనున్న మోదీ, రాజ్ నాథ్ సింగ్

భారత స్వావలంబనకు ప్రధాని మోదీ ఈ నెల 15 న స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొత్త ‘ నిర్వచనాన్ని’ ప్రకటిస్తారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. మహాత్ముడు ప్రవచించిన ‘స్వదేశీ’ నినాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడమే నిర్వచన ధ్యేయమన్నారు. స్వావలంబనకు సంబంధించి మోదీ పేర్కొన్న ప్రణాళికను అమలు పరచేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు. విప్లవ స్వాతంత్య్ర సమరయోధుడు ఉధం సింగ్ కి ఆన్ లైన్ ద్వారా నివాళి అర్పించిన సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడారు.

స్వావలంబన అన్నది లేకపోతే ఒక దేశం తన సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోజాలదన్న వాదనను కరోనా వైరస్ పాండమిక్ చూపిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 15 న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధానిమోదీ.. ఎర్రకోటపై నుంచి దేశప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.