AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kisan Drones: రైతులకు మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. పంట పొలాల్లో పురుగుమందు పిచికారీ కోసం కిసాన్‌ డ్రోన్‌లు

Kisan Drones: రైతులకు సహాయపడే లక్ష్యంతో పంట పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేసేందుకు మోడీ సర్కార్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న..

Kisan Drones: రైతులకు మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. పంట పొలాల్లో పురుగుమందు పిచికారీ కోసం కిసాన్‌ డ్రోన్‌లు
Subhash Goud
|

Updated on: Feb 19, 2022 | 11:46 AM

Share

Kisan Drones: రైతులకు సహాయపడే లక్ష్యంతో పంట పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేసేందుకు మోడీ సర్కార్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసేందుకు 100 కిసాన్ డ్రోన్‌ (Kisan Drones)లను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. వివిధ నగరాల్లో, పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా పంట పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేసేందుకు ప్రధాని మోడీ సర్కార్‌ (Modi Government) కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు పంట సాగులో పనులు సులభతరం అయ్యేందుకు చర్యలు చేపట్టింది మోడీ సర్కార్‌. రైతులకు సహాయం చేసే విధంగా ప్రత్యేక డ్రైవ్‌లో దేశ వ్యాప్తంగా పొలాల్లో పురుగులమందును పిచికారీ చేయడానికి వివిధ నగరాలు, పట్టణాలలో వంద కిసాన్‌ డ్రోన్‌లను ప్రారంభించారు మోడీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో గరుడ ఏరోస్పెస్‌ కింద లక్ష మేడ్‌ ఇన్‌ ఇండియా డ్రోన్లను తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

ఇది యువతకు కొత్త ఉపాధి, కొత్త అవకాశాలను తీసుకువస్తుందని అన్నారు. 21వ శతాబ్దపు ఆధునిక వ్యవసాయ సౌకర్యాల దిశలో ఇది కొత్త అధ్యాయం అని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో అపరిమిత అవకాశాలు వస్తాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డ్రోన్‌ల ద్వారా రైతులకు ఎంతో సహకారంగా ఉంటుందని భావిస్తున్నట్లు మోడీ అన్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌లో దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేసే బడ్జెట్‌ కేటాయించినట్లు పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా రైతులకు డిజిటల్‌, హైటెక్‌ టెక్నాలజీని అందించడానికి కేంద్రం కిసాన్‌ డ్రోన్లు, రసాయన రహిత సహజ వ్యవసాయం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతామాన్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తెలిపారని మోడీ అన్నారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగుమందులు, పోషకాలను పిచికారీ చేయడం కోసం కిసాన్ డ్రోన్‌లను ప్రోత్సహిస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి:

PM Modi: ఎన్నికలకు ముందు సిక్కులతో ప్రధాని మోడీ సమావేశం.. వ్యూహం ఫలించేనా..?

Maharashtra: మహారాష్ట్రలో మారుతున్న రాజకీయం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం.. సవాల్‌గా స్పీకర్ ఎన్నిక!