PM Modi Mann Ki Baat: మన శత్రువైన సరే.. మంచి గుణాలను స్వీకరించాలి.. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
గత ఎపిసోడ్లలో మాట్లాడిన వారితో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్లీ మాట్లాడి వారి యోగక్షేమాలు కనుక్కున్నారు. 2014 విజయదశమి రోజున మన్ కీ బాత్ ప్రయాణం మొదలైన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన ప్రతీ అంశమూ ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ పలు అంశాల గురించి ప్రస్తావిస్తూనే.. పలువురు ప్రముఖులను ప్రశంసించారు. ‘మన్ కీ బాత్’ సానుకూలతను వ్యాప్తి చేయడానికి, అట్టడుగు స్థాయి మార్పు చేసేవారిని గుర్తించడానికి ఒక అద్భుతమైన వేదిక అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. “నేను నా హృదయం నుంచి చెబుతున్నాను, వాస్తవానికి, ‘మన్ కీ బాత్’ శ్రోతలు, మన దేశప్రజలు మీరందరూ ఈ అభినందనలకు అర్హులు.” అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అనే విషయాలను ప్రస్తావించారు. 2014 నుంచి ప్రారంభమైన మన్ కీ బాత్ వందో ఏపిసోడ్ కు చేరుకున్న సందర్భంగా లక్షలాది ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేసి.. లైవ్ ప్రసారం నిర్వహించారు.
- గత ఎపిసోడ్లలో మాట్లాడిన వారితో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్లీ మాట్లాడి వారి యోగక్షేమాలు కనుక్కున్నారు. 2014 విజయదశమి రోజున మన్ కీ బాత్ ప్రయాణం మొదలైన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన ప్రతీ అంశమూ ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇతరుల్లో మంచి గుణాలను స్వీకరించాలని దేశప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.
- గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను నిత్యం ప్రజలను కలిసేవాడిని, కాని ఢిల్లీకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మోదీ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలతో మమేకమయ్యేందుకు సాధనంగా నిలిచిందని అన్నారు.
- మన శత్రువైన సరే వారి మంచి పనులను మనం ప్రేరేపించాలి.. అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. మన్ కి బాత్ ద్వారా దేశ ప్రజల నుండి నేనెప్పుడూ దూరం కాలేదన్నారు. మన్ కీ బాత్ ద్వారా ప్రేరేపించిన వాళ్ళందరూ హీరోలు అంటూ కొనియాడారు. 100వ మన్ కి బాత్ లో హర్యానాకు చెందిన సునీల్, స్లేట్ పెన్సిల్స్ తయారు చేసే తమిళనాడు కి చెందిన మంజూర్ అనే వ్యక్తి తో ప్రత్యేకంగా సంభాషించారు.
- ‘మన్ కీ బాత్’ కోట్లాది మంది భారతీయుల ‘మన్ కీ బాత్’, ఇది వారి భావాల వ్యక్తీకరణ,” అని ప్రధాని 100వ ఎపిసోడ్‌లో పేర్కొన్నారు. “మన్ కీ బాత్ అనేది నా నుంచి మనలోకి ఒక ప్రయాణం. స్నేహితులారా, మన్ కీ బాత్‌లో మనం ప్రస్తావించిన వ్యక్తులందరూ ఈ కార్యక్రమాన్ని సజీవంగా మార్చిన మా హీరోలు” అని అన్నారు.
- “నాకు ‘మన్ కీ బాత్’ అనేది ఒక కార్యక్రమం కాదు, నాకు ఇది విశ్వాసం, ఆరాధన, ఉపవాసం.. లాంటిది.. నాకు ‘మన్ కీ బాత్’ అనేది భగవంతుని పాదాల వద్ద ప్రసాదం ప్లేట్ వంటిది.. అంటూ పీఎం మోడీ పేర్కొన్నారు. ‘మన్ కీ బాత్’ నాకు భారత ప్రజలతో కనెక్ట్ అయ్యే వేదికను ఇచ్చింది.. అని ప్రధాని మోదీ అన్నారు. ఇది ఇతరులలోని గుణాలను ఆరాధించడం.. సానుకూలతను వ్యాప్తి చేయడం, ప్రజల భాగస్వామ్యాన్ని బలపర్చడం లాంటివి చేసిందన్నారు.
- ఈ సందర్భంగా నారీ శక్తి గురించి ప్రధాని మోడీ వివరించారు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారం హర్యానాలో లింగ నిష్పత్తిని మెరుగుపరిచిందని మన్ కీ బాత్ 100వ ఎడిషన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. “నేను హర్యానా నుండే ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారాన్ని ప్రారంభించాను. ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రచారం నన్ను చాలా ప్రభావితం చేసింది.. నా ఎపిసోడ్‌లో నేను దానిని ప్రస్తావించాను. త్వరలో ఈ ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రచారం ప్రపంచవ్యాప్తమైంది. దీని ఉద్దేశ్యం ఒకరి జీవితంలో కుమార్తె ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయడమే’’ అని ప్రధాని మోదీ అన్నారు.
- ‘స్వచ్ఛ్ భారత్’ అయినా, ఖాదీ అయినా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అయినా మన్‌కీ బాత్‌లో లేవనెత్తిన అంశాలు ప్రజా ఉద్యమాలుగా మారాయని ప్రధాని మోడీ అన్నారు. మన్ కీ బాత్‌కి మరో ప్రత్యేకత ఉంది. మన్ కీ బాత్ ద్వారా అనేక ప్రజా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.. ఇంకా ఊపందుకున్నాయి” అని 100వ ఎపిసోడ్‌లో ప్రధాని చెప్పారు.
- మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీకి యూనెస్కో శుభాకాంక్షలు తెలిపింది. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే ప్రధాని మోడీ సేవలను ప్రశంసించారు.
- నదులు, పుణ్యక్షేత్రాలు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని ప్రధాని మోదీ మరోసారి గుర్తుచేశారు. మన సహజ వనరులు.. నదులు, పర్వతాలు, చెరువులు లేదా మన తీర్థయాత్రలు కావచ్చు, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం” అని ప్రధాని మోదీ అన్నారు.
- విద్య, సంస్కృతిలో భారతదేశం చేస్తున్న కృషి నిజంగా అభినందనీయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విద్య లేదా సంస్కృతి గురించి అయినా, దాని పరిరక్షణ లేదా ప్రమోషన్ గురించి అయినా, ఇది భారతదేశం పురాతన సంప్రదాయం, నిజంగా ప్రశంసనీయం” అని ప్రధాని మోదీ అన్నారు.
- మన్ కీ బాత్ మహిళా సాధికారతకు సంబంధించిన వివిధ కథనాలను కవర్ చేయడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దేవరా గ్రామంలోని మహిళలు, తమిళనాడులోని గిరిజన మహిళలు టెర్రకోట కప్పులను తయారు చేయడం, వెల్లూరు సరస్సును పునరుద్ధరించే మహిళలు వంటి మహిళా సాధికారతకు సంబంధించిన వివిధ కథనాలను మన్ కీ బాత్ కవర్ చేసినందుకు సంతోషిస్తున్నానన్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహించడం నుంచి మేక్ ఇన్ ఇండియా, స్పేస్ స్టార్టప్‌ల వరకు విభిన్న రంగాలలో ప్రతిభావంతులైన వ్యక్తుల కథలను ప్రదర్శించింది. మన బొమ్మల పరిశ్రమను తిరిగి స్థాపించే లక్ష్యం మన్ కీ బాత్‌తో ప్రారంభమైంది అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..