COVID-19: కరోనా విజృంభణ.. మరోసారి సీఎంలతో భేటీ కానున్న ప్రధాని మోదీ

PM Narendra Modi: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కొంతకాలం నుంచి దేశంలో భారీగా తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 కేసులు.. ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం

COVID-19: కరోనా విజృంభణ.. మరోసారి సీఎంలతో భేటీ కానున్న ప్రధాని మోదీ
PM Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 15, 2021 | 9:08 PM

PM Narendra Modi: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కొంతకాలం నుంచి దేశంలో భారీగా తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 కేసులు.. ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు కాస్త.. ఆ రాష్ట్రంలో 15వేలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ సైతం ప్రకటించింది. కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో ఆంక్షలు సైతం విధించారు. పలు ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. కాగా.. కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తిరిగి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. ఇప్పటికే పలు మార్గదర్శకాలను విడుదల చేసి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం.. నేరుగా రాష్ట్రాల పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు తగిన చర్యలను అమలు చేస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ సీఎంలతో చర్చించనున్నారు. ఏం చర్యలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చన్న సమాలోచనలను ప్రధాని జరపనున్నారు. దీంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించనున్నారు. చాలా రోజుల తరువాత ప్రధాని మోదీ సీఎంలతో చర్చించనున్న నేపథ్యంలో ప్రధాన్యం సంతరించుకుంది.

దేశంలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుండగా.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. పది వేలకు దిగువన నమోదైన కేసులు కాస్త.. మళ్లీ 26 వేలకు పెరగడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

Also Read:

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!