Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ఇవాళ జాతీయ బాలల అవార్డు గ్రహీతలతో మాట్లాడనున్న ప్రధాని మోదీ..

ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 11 మంది పిల్లలు బాల శక్తి పురస్కారం వివిధ కేటగిరీల క్రింద పీఎంఆర్‌బీపీ -2023కి ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 6 మంది బాలురు, 5 మంది బాలికలు ఉన్నారు.

PM Narendra Modi: ఇవాళ జాతీయ బాలల అవార్డు గ్రహీతలతో మాట్లాడనున్న ప్రధాని మోదీ..
PM Narendra Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 24, 2023 | 10:07 AM

ప్రధాన మంత్రి బాల శక్తి పురస్కారాలు అందుకున్నవారితో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జాతీయ బాలల అవార్డు గ్రహీతలతో సంభాషించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆవిష్కరణ, సామాజిక సేవ, విద్యావేత్తలు, క్రీడలు, కళలు, సంస్కృతి, ధైర్యసాహసాలు వంటి ఆరు విభాగాలలో అసాధారణ విజయాలు సాధించిన పిల్లలకు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారాలను అందజేస్తుంది. దీని కింద ప్రతి అవార్డు గ్రహీతకు పతకం, లక్ష రూపాయల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 11 మంది పిల్లలు బాల శక్తి పురస్కారం వివిధ కేటగిరీల క్రింద PMRBP-2023కి ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆరుగురు బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారు.

పిల్లలు దేశ ప్రయోజనాల గురించి ఆలోచించాలని, అవకాశం దొరికినప్పుడల్లా దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం దిశానిర్దేశం చేశారు.  11 మంది చిన్నారులకు ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారాన్ని ముర్ము అందజేశారు. “పిల్లలు మన దేశానికి అమూల్యమైన ఆస్తి. వారి భవిష్యత్తు నిర్మాణం కోసం చేసే ప్రతి ప్రయత్నం మన సమాజం, దేశం భవిష్యత్తును నిర్దేశిస్తుంది. వారి సురక్షితమైన, సంతోషకరమైన బాల్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనం చేయగలిగినదంతా చేయాలి” అని రాష్ట్రపతి ముర్ము అన్నారు.

ఇంత చిన్నవయసులోనే అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించారు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ, “పిల్లలకు అవార్డులు ఇవ్వడం ద్వారా, మేము దేశ నిర్మాణంలో వారి సహకారాన్ని ప్రోత్సహిస్తున్నాం.. గౌరవిస్తున్నాం.” అవార్డు గ్రహీతల్లో కొందరు ఇంత చిన్న వయసులోనే ఇంతటి అచంచలమైన ధైర్యాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించారని, వారి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోవడమే కాకుండా పొంగిపోయానని రాష్ట్రపతి ముర్ము అన్నారు. వారి ఉదాహరణలు బాలలు, యువత అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, “మేము దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య మకరందాన్ని జరుపుకుంటున్నాం, మేము చాలా కష్టపడి స్వాతంత్ర్యం పొందాం, కాబట్టి వారంతా ఈ స్వేచ్ఛ విలువను గుర్తించి దానిని రక్షించాలని కొత్త తరం నుంచి ఆశిస్తున్నాం.” పిల్లలు ఎక్కడ అవకాశం దొరికినా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించాలని, దేశం కోసం పని చేయాలని సూచించారు.

మన తెలుగు రాష్ట్రాలకు చెందిన..

అసాధారణ విజయాలు సాధించిన 11 మంది పిల్లలకు ప్రధాన మంత్రి బాల శక్తి పురస్కారాలు అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. వీరిలో ఇద్దరుతెలుగువారికి కూడా ప్రధాన్‌మంత్రి బాల పురస్కార్‌ అవార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోలగట్ల మీనాక్షి, తెలంగాణకు చెందిన గౌరవిరెడ్డితో పాటు మొత్తం 11 మంది బాలలు 2023 సంవత్సరానికి గాను ప్రధాన మంత్రి జాతీయ బాల శక్తి పురస్కారాలు అందుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందుకున్నారు.

చిన్న వయస్సులో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి దేశానికి పేరు తీసుకొచ్చిన బాలలను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో అంతర్జాతీయ చందరంగం క్రీడాకారిణి కోలగట్ల ఆలన మీనాక్షి 2022 అక్టోబర్‌లో ప్రకటించిన ర్యాంకింగ్స్ 11 ఏళ్ల లోపు వయసు కేటగిరీలో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణిగా నిలిచింది. ఇక క్రీడల విభాగంలో మీనాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జాతీయ బాలల పురస్కారానికి ఎంపికైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం