AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కాంగ్రెస్‌ నేతలకు అది అలవాటుగా మారింది.. సంచలన కామెంట్స్ చేసిన ప్రధాని మోదీ..

కర్నాటకలో ప్రధాని మోదీ సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దావణగెరెలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు మోదీ. కాంగ్రెస్‌లో కార్యకర్తలకు విలువ లేదని, బీజేపీలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ నేతలకకు తనపై తప్పుడు ప్రచారం చేయడం

PM Modi: కాంగ్రెస్‌ నేతలకు అది అలవాటుగా మారింది.. సంచలన కామెంట్స్ చేసిన ప్రధాని మోదీ..
PM Modi
Shiva Prajapati
|

Updated on: Mar 25, 2023 | 8:54 PM

Share

కర్నాటకలో ప్రధాని మోదీ సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దావణగెరెలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు మోదీ. కాంగ్రెస్‌లో కార్యకర్తలకు విలువ లేదని, బీజేపీలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ నేతలకకు తనపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు. కాగా, ప్రధాని మోదీతో ఈ సభకు సీఎం బస్వారాజ్‌ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప కూడా హాజరయ్యారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే సొంత ఊరు కలబుర్గిలో జరిగిన మేయర్‌, డిప్యూటీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని అన్నారు మోదీ. కాంగ్రెస్‌ నేతలకు తనపై తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటని, కలబుర్గిలో బీజేపీ విజయం వెనుక మోదీ కుట్ర ఉందని తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉందన్నారు.

బెంగళూర్‌ మెట్రో రెండో దశ ప్రారంభం..

కర్నాటకలో మరోసారి బీజేపీ విజయం సాధిస్తుందని , డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తుందన్నారు మోదీ . అంతకుముందు కర్నాటకలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని మోదీ. బెంగళూర్‌ మెట్రో రెండో దశను ప్రారంభించారు. మెట్రోలో కార్మికులతో కలిసి ప్రయాణం చేశారు.

ఇవి కూడా చదవండి

124 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్‌ తొలిజాబితా..

మరోవైపు కాంగ్రెస్‌ కూడా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతోంది. 124 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్‌ తొలిజాబితా విడుదలయ్యింది. పీసీసీ ప్రెసిడెంట్‌ డీకేశివకుమార్ కనకపుర , మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..