Watch: మరోమారు ప్ర‌ధాని మోడీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం.. వైరల్‌గా మారిన వీడియోలు..

దావనగిరిలోనే మూడుచోట్ల భద్రతాలోపం బయటపడింది. ప్రధాని ర్యాలీలోకి దూసుకొచ్చిన యువకుడు బస్వరాజ్‌ గా గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Watch: మరోమారు ప్ర‌ధాని మోడీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం.. వైరల్‌గా మారిన వీడియోలు..
Narendra Modi's Roadshow
Follow us

|

Updated on: Mar 25, 2023 | 8:49 PM

కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో సందర్భంగా మరోమారు భద్రతా వైఫల్యం కనిపించింది. శనివారం కర్నాటకలోని దావణగిరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని రోడ్‌షో సందర్భంగా ప్రధాని కాన్వాయ్ వైపు ఓ వ్యక్తి పరుగెత్తుతున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. అయితే, వెంటనే వేదిక వద్ద ఉన్న భద్రతా బలగాలు, అంగరక్షకులు అతన్ని అడ్డుకున్నారు.

కర్ణాటకలోని దావనగిరిలో ప్రధాని కాన్వాయ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు దూసుకొచ్చారు. దావనగిరిలోనే మూడుచోట్ల భద్రతాలోపం బయటపడింది. ప్రధాని ర్యాలీలోకి దూసుకొచ్చిన యువకుడు బస్వరాజ్‌ గా గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ సభ దగ్గర కూడా డీ జోన్‌లోకి ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రవేశించాడు. మోదీ ప్రసంగిస్తుండగా మరోసారి భారీకేడ్లు తోసుకొచ్చారు జనాలు.

ఇవి కూడా చదవండి

గతంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటక పర్యటనలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. భద్రతా సిబ్బందిని దాటుకొని ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. ప్రధాని మోడీకి దండ వేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మోడీ టూర్‎లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. కర్ణాటకలో రోడ్ షో నిర్వహిస్తున్న మోడీ… 29వ జాతీయ యువనోత్సవాలను ప్రారంభించారు. బెంగళూరు, హుబ్బలిలో భారీ ఎత్తున జరిగిన రోడ్ నిర్వహించారు. దాదాపు ఈ ఉత్సవాల్లో 30వేల మంది యువతీ, యువకులు పాల్గొన్నారు. యువనోత్సవాలను పురష్కరించుకొని కర్నాటక ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..