AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC paper leak: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్స్‌లో సంచలన విషయాలు.. తవ్వేకొద్దీ కుప్పలుతెప్పలుగా ..

ఒక్కరు కాదు... నలుగురు వ్యక్తులు ఏడున్నర లక్షలకు..ఏఈ పేపర్‌ కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించాయి. ఇందులో షాద్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి బండారం బయటపడింది. అతడి కోసం సిట్ గాలిస్తోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ అధికారులు ఇప్పటికి 13 మందిని అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే...

TSPSC paper leak: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్స్‌లో సంచలన విషయాలు.. తవ్వేకొద్దీ కుప్పలుతెప్పలుగా ..
Tspsc
Jyothi Gadda
|

Updated on: Mar 25, 2023 | 6:12 PM

Share

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రిలిమ్స్‌లో 25 వేల మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అందులో 121 మందికి 100కుపైగా మార్కులు వచ్చాయి….ఈ 121 మందిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఐలు ఉండడంతో సిట్‌ వారిపై దృష్టి సారించింది. 100కి పైగా మార్కులు వొచ్చిన వారందరినీ విచారించేందుకు సిట్‌ సిద్ధమైంది. ఇప్పటికే 121 మందికి నోటీసులు జారీ చేశారు సిట్‌ అధికారులు. 42 మందిని విచారించారు. ఇంకా ఎంతమందికి పేపర్ లీక్ అయ్యిందనే దానిపై సిట్ అధికారులు దృష్టిపెట్టారు.

మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్స్‌లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అరెస్టయిన కమిషన్‌ సిబ్బంది తీరు అనేక అనుమానాలకు తెరతీస్తోంది. పేపర్ లీక్‌తో 150 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉన్నా…దొరికిపోతామన్న భయంతో…పూర్తి మార్కులు తెచ్చుకోకుండా పక్కా ప్లాన్‌ ప్రకారం వ్యవహరించిన TSPSC సిబ్బంది క్రిమినల్‌ మైండ్‌ కలకలం రేపుతోంది. ఏఎస్‌వోలు ప్రవీణ్‌కి 103, షమీమ్‌కు 127 మార్కులు రాగా…సురేష్‌, రమేష్‌లకు 100కుపైగానే మార్కులు రావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. తవ్వేకొద్దీ కుప్పలుతెప్పలుగా బయటపడుతోంది రాజశేఖర్‌ మోసాల చిట్టా. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేటలో..ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్…లీకేజీ కేసులో కీలక నిందితుడు రాజశేఖర్‌కి స్వయానా బావ. రాజశేఖర్‌ బావ ప్రశాంత్‌రెడ్డి పరీక్ష రాసినట్టు తేలడంతో అతడిని సైతం సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రాజశేఖర్‌ బావ ప్రశాంత్‌రెడ్డి, రేణుక ఇంట్లో సిట్‌ సోదాల్లో మరిన్ని నిజాలు బయటపడ్డాయి. ఒక్కరు కాదు… నలుగురు వ్యక్తులు ఏడున్నర లక్షలకు..ఏఈ పేపర్‌ కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించాయి. ఇందులో షాద్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి బండారం బయటపడింది. అతడి కోసం సిట్ గాలిస్తోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ అధికారులు ఇప్పటికి 13 మందిని అరెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ పై ఆరోపణలు గుప్పించిన బండి సంజయ్‌కి మరోసారి సిట్‌ నోటీసులు జారీచేసింది. అందులో భాగంగానే బండి సంజయ్‌ ఇంటికి వెళ్ళారు సిట్‌ అధికారులు. ఈనెల 24న సిట్‌ ఎదుట హాజరుకావాలని బండి సంజయ్‌కి సిట్‌ గతంలో నోటీసులు ఇచ్చింది. బండి 24న హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సిట్‌ అధికారులు.

మరోవైపు ధర్నాచౌక్‌ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది. బండి సంజయ్‌ నేతృత్వంలో జరిగిన ధర్నాకి చేరుకునేందుకు ఓయూ విద్యార్థులు భారీ ఎత్తున తరలి రావడంతో ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజ్‌ వద్ద హైటెన్షన్‌ క్రియేట్‌ అయ్యింది. పేపర్‌ లీక్‌ను నిరసిస్తూ ఏబీవీపీ ఆరోజు ర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే ఏబీవీపీ ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు. ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో ఓయూలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మరిన్ని తెలంగాణ న్యూస్‌ కోసం..

Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్