AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi in UP: అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు.. విపక్షాలపై ప్రధాని మోడీ ధ్వజం

PM Modi in UP: కీలకమైన అభివృద్ధి పనులు,  ప్రాజెక్టులకు విపక్షాల ఆలోచనా తీరు కారణంగా దశాబ్ధాలుగా అడ్డంకులు ఏర్పడ్డాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు.

PM Modi in UP: అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు.. విపక్షాలపై ప్రధాని మోడీ ధ్వజం
Pm Modi
Janardhan Veluru
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 23, 2021 | 6:14 PM

Share

PM Modi in UP: కీలకమైన అభివృద్ధి పనులు,  ప్రాజెక్టులకు విపక్షాల ఆలోచనా తీరు కారణంగా దశాబ్ధాలుగా అడ్డంకులు ఏర్పడ్డాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ లోని బలరాంపూర్‌లో ప్రతిష్టాత్మక సరయూ కెనాల్ జాతీయ ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 14 లక్షల హెక్టార్లలోని భూములకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా యూపీలోని 29 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దాదాపు రూ.9,800 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పాటిల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విపక్షాలపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు.  ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయంటూ ఆరోపించారు.

కాగా హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తో పాటు జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఘననివాళి అర్పించారు. ఈ ఘటనతో దేశమంతా విషాదంలో మునిగిపోయిన విషయం వాస్తవమేనని , వీటిని తట్టుకుని నిలబడే శక్తి భారత్‌కు ఉందన్నారు. ప్రమాదంలో గాయపడ్డ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ ప్రాణాలను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.  జనరల్‌ బిపిన్ రావత్‌ మృతి దేశానికి తీరని లోటు అన్నారు. కాని ఇలాంటి కష్టసమయాల్లోనే భారత్‌ మరింత శక్తివంతంగా తయారవుతుందని.. అభివృద్ది ఆగదన్నారు. జీవితమంతా భారత సైన్యాన్ని శక్తివంతం చేయడానికే జనరల్‌ బిపిన్‌ రావత్‌ పనిచేశారని ప్రశంసించారు.

త్వరలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చి మాసాల్లో యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Also Read..

Chandrababu Naidu: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్.. రాజీనామా చేద్దామంటూ YSRCPకి చంద్రబాబు ఛాలెంజ్

Covid 19 Omicron: దేశంలో కొత్త వేరింట్ కలవరం.. పెరుగుతున్న కరోనా కేసులు.. మరోసారి ఆంక్షల దిశగా కేంద్రం!

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు