PM Modi: బ్రిటన్ చేరుకున్న భారత ప్రధాని మోడీ.. గ్లాస్కోలో ప్రవాసీల ఘన స్వాగతం
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ బ్రిటన్ చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి అధ్వర్యంలో జరుగుతున్న 26వ ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (COP-26)లో ప్రధాని మోడీ పాల్గొంటారు.
PM Modi in Glasgow: విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ బ్రిటన్ చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి అధ్వర్యంలో జరుగుతున్న 26వ ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (COP-26)లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులపై జరిగే కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగిస్తారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున యూకేలోని గ్లాస్కో చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో సమావేశం కానున్నారు. గ్లాస్కో విమానాశ్రయంలో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కు చోరుకోగా.. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఓ చిన్నారితో ప్రధాని ముచ్చటించారు. ఇదిలావుండగా.. గ్లాస్కోలో ఆదివారం రెండు రోజుల పాటు జరిగే ఇంటెన్సివ్ కాన్ఫరెన్స్ ప్రారంభం కాగా.. నవంబర్ 12 వరకు కొనసాగుతుంది. ఈ సమావేశంలో వాతావరణ మార్పుల సమస్య అంశంపై భారత్ లేవనెత్తే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి అధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో బ్రిటన్ అధ్యక్షతన ఈ సమ్మిట్ జరుగుతోంది. కాప్-26 సమావేశంలో 120 కంటే ఎక్కువ దేశాల నాయకులు పాల్గొననున్నారు. వాతావరణ మార్పులకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
Landed in Glasgow. Will be joining the @COP26 Summit, where I look forward to working with other world leaders on mitigating climate change and articulating India’s efforts in this regard. pic.twitter.com/G4nVWknFg1
— Narendra Modi (@narendramodi) October 31, 2021