PM Modi: విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు నిర్మాణ కార్మికులకు అరుదైన గౌరవం.. వారితో కలిసి భోజనం చేసిన ప్రధాని మోడీ..
వారణాసి విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పనుల్లో చేయి చేయి కలిపిన నిర్మాణ కార్మికులకు అత్యున్నత గౌరవం దక్కింది. వారి సేవలకు గౌరవంగా..
Honouring Kashi Vishwanath Dham Corridor workers: వారణాసి విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పనుల్లో చేయి చేయి కలిపిన నిర్మాణ కార్మికులకు అత్యున్నత గౌరవం దక్కింది. వారి సేవలకు గౌరవంగా వారిపై ప్రధాని నరేంద్ర మోదీ పూల వర్షం కురిపించారు. అనంతరం వారితో కలిసి ఆయన గ్రూప్ ఫొటో తీయించుకున్నారు. ప్రధాని మోడీతోపాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ కూడా సహపంక్తి భోజనం చేశారు. భోజనం తర్వాత ఆ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రధాని మోదీతో కలిసి భోజనం చేసిన ఆ నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వారితో కాసేపు మాట్లాడారు.
#WATCH | Varanasi: PM Narendra Modi along with CM Yogi Adityanath had lunch with the workers involved in construction work of Kashi Vishwanath Dham Corridor. pic.twitter.com/XAX371ThEw
— ANI UP (@ANINewsUP) December 13, 2021
కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు ఆవిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చమట చిందించిన సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. కరోనా ప్యాండెమిక్ సమయంలోనూ కార్మికులు పనులు ఆపలేదన్నారు. ఇప్పుడు వాళ్లను కలిసి ఆశీర్వాదం తీసుకునే అవకాశం తనకు దక్కిందన్నారు. ఈ కారిడార్ కేవలం భవనాల నిర్మాణం కాదని.. భారత సనాత సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని మోడీ అన్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయ నిర్మాణంలో ఇది సరికొత్త అధ్యయమని, కాశీలో అడుగుపెట్టగానే ప్రత్యేక అనుభూతి కలుగుతోందని అన్నారు. కారిడార్ నిర్మాణంలో శ్రామికుల కష్టం వెలకట్టలేనిదన్నారు. ఈ కారిడార్ సాయంతో దివ్యాంగులు, వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవచ్చని తెలిపారు మోడీ.
వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, గంగా నదిలో పవిత్ర స్నానం అచరించారు. అనంతరం కాశీ విశ్వనాథ మెగా ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
PM Narendra Modi takes holy dip in River Ganga at Varanasi pic.twitter.com/yGK9YRTCrO
— ANI UP (@ANINewsUP) December 13, 2021
అనంతరం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
#WATCH Prime Minister Narendra Modi offers prayers at Kashi Vishwanath temple in Varanasi pic.twitter.com/4pLpNubg2z
— ANI UP (@ANINewsUP) December 13, 2021
కాశీ కారిడార్ ప్రత్యేకతలు.. 1669లో అహిల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత దాదాపు 350 ఏళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ విస్తరణ, పునరుద్ధరణ కోసం 2019 మార్చి 8న విశ్వనాథ్ ఆలయ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. అది జరిగిన దాదాపు రెండేళ్ల 8 నెలలకు ఇప్పుడు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో 95 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం కారిడార్ నిర్మాణానికి రూ.340 కోట్లు వ్యయం చేశారని భావిస్తున్నారు.
మొత్తం కారిడార్‌ను దాదాపు 50 వేల చదరపు మీటర్ల ఒక పెద్ద ప్రాంగణంగా నిర్మించారు. దీని ప్రధాన ప్రవేశ మార్గం గంగానది వైపు లలితా ఘాట్ నుంచి ఉంటుంది. విశ్వనాథ్ కారిడార్‌ను మొత్తం 3 భాగాలుగా విభజించారు. మొదటిది ఆలయ ప్రధాన భాగం. దీనిని రెడ్ శాండ్ స్టోన్‌తో నిర్మించారు. ఇందులో నాలుగు పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఇందులో ఒక ప్రదక్షిణ మార్గం కూడా నిర్మించారు. ఆ ప్రదక్షిణ మార్గంలో 22 మార్బుల్స్ మీద కాశీ మహిమను వర్ణించే వివరాలు చెక్కారు.
ఈ కారిడార్‌లో 24 భవనాలు కూడా నిర్మించారు. వీటిలో ప్రధాన ఆలయ ప్రాంగణం, ఆలయ చౌరస్తా, ముముక్షు భవన్, యాత్రికుల వసతి కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ హాల్, సిటీ మ్యూజియం, వారణాసి గ్యాలరీ, గంగా వ్యూ కెఫే రెస్టారెంట్ ఉన్నాయి. ఈ ధామ్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ప్రాంగణం చుట్టూ 5 వేలకు పైగా లైట్లు ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ లైట్లు పగటి పూట, మధ్యాహ్నం, రాత్రి రంగులు మారుతూ ఉంటాయి.