PM Modi: సరికొత్త శక్తినిస్తుంది.. యువత కలలు నెరవేర్చేలా బడ్జెట్: ప్రధాని మోదీ
PM Modi on Budget 2024: కేంద్ర మంత్రి సమర్పించిన బడ్జెట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.. ఈ బడ్జెట్ పేద-మధ్యతరగతి వర్గానికి సాధికారత కల్పిస్తుందని తెలిపారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అంటూ కొనియాడారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని.. ఈ బడ్జెట్ పేద-మధ్యతరగతి వర్గాల సాధికారత కోసమేనని తెలిపారు.
PM Modi on Budget 2024: కేంద్ర బడ్జెట్ 2024 ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి సమర్పించిన బడ్జెట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.. ఈ బడ్జెట్ పేద-మధ్యతరగతి వర్గానికి సాధికారత కల్పిస్తుందని తెలిపారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అంటూ కొనియాడారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని.. ఈ బడ్జెట్ పేద-మధ్యతరగతి వర్గాల సాధికారత కోసమేనని తెలిపారు. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ యువత నైపుణ్యాలను పెంచే బడ్జెట్ అంటూ పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చే బడ్జెట్ అని.. దేశ ఆర్థిక వృద్ధికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తయారీ రంగంలో భారత్ ప్రపంచ హబ్‌గా మారుతుందన్నారు. ముద్ర రుణాలను రూ.20 లక్షలకు పెంచామని.. కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ కల్పన జరుగుతుందని తెలిపారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత కోసం ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. మధ్య తరగతిపై ట్యాక్స్ భారాన్ని తగ్గించామని.. TDS నిబంధనలు సరళీకృతం చేశామని తెలిపారు. పేదలకోసం మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేశామని.. దేశంలో కూరగాయల ఉత్పత్తి పెంపునకు క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు.
యువత కలలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందని ప్రధాని మోదీ వివరించారు. నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. మధ్య తరగతికి భరోసా ఇచ్చే బడ్జెట్ ఇది అని..మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశామని తెలిపారు. చిరువ్యాపారులు, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కొత్తబాటలు వేశామని తెలిపారు.
ఈ బడ్జెట్‌లో, ప్రభుత్వం ‘ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను ప్రకటించిందని.. ఇది అనేక ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు సహాయపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ పథకం కింద, కొత్తగా వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే వారికి ప్రభుత్వం మొదటి జీతం ఇస్తుందన్నారు. గ్రామాల నుండి యువత అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాం కింద దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో పని చేయగలరంటూ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..