PM Modi: అయోధ్య రామాలయంపై స్మారక తపాలా స్టాంపులు.. ఆవిష్కరించిన ప్రధాని మోదీ..
యావత్ దేశం కాదు సమస్త ప్రపంచంలోని హిందూవులు, శ్రీరాముని భక్తులు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే శ్రీ రామ జన్మభూమి మందిరంపై స్మారక తపాలా స్టాంపులను విడుదల చేసింది మోదీ సర్కార్. అలాగే శ్రీరాముని అయోధ్య ఆలయానికి సంబంధించిన పుస్తకాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.
యావత్ దేశం కాదు సమస్త ప్రపంచంలోని హిందూవులు, శ్రీరాముని భక్తులు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే శ్రీ రామ జన్మభూమి మందిరంపై స్మారక తపాలా స్టాంపులను విడుదల చేసింది మోదీ సర్కార్. అలాగే శ్రీరాముని అయోధ్య ఆలయానికి సంబంధించిన పుస్తకాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. స్టాంపులను ముద్రించిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. ఈ స్టాంపులలో రామమందిరం, చౌపై ‘మంగల్ భవన్ అమంగల్ హరి’, సూర్యుడు, సరయు నదితో పాటు ఆలయం చుట్టుపక్కలి శిల్పాలు ఉన్నాయి. రామాలయం, గణేష్, హనుమాన్, జటాయు, కేవత్రాజ్, మాతా శబరి ఇలా మొత్తం ఆరుగురికి సంబంధించిన స్టాంపులు ఉన్నాయి. ఈ పుస్తకంలో గంభీరంగా కనిపించే సూర్యకిరణాలు ‘పంచభూతాల’ను ప్రతిబింబించేలా ఉన్నాయి. అంటే ఆకాశం, గాలి, అగ్ని, భూమి, నీరు ఈ ఐదు భౌతికాంశాలు ఈ పుస్తకంపై కనిపించేలా రూపొందించారు. అలాగే 48 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో వివిధ దేశాలకు చెందిన స్టాంపులను కూడా ముద్రించారు. శ్రీరాముని కీర్తిని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందేందుకు ఇది దోహదపడుతుందంటున్నారు. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియాతోపాటు యునైటెడ్ నేషన్ పరిధిలోని 20 కంటే ఎక్కువ దేశాల స్టాంపులను ఇందులో అచ్చు వేశారు.
దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు. ఆరు స్మారక స్టాంపులపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈరోజు, శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా అభియాన్ అనే మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. శ్రీరామ జన్మభూమి ఆలయంపై 6 స్మారక తపాలా స్టాంపులతో కూడిన ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దేశ ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు. జనవరి 16న రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బుధవారం, ముందుగా ‘కలశ పూజ’ నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఉపచారాలు జనవరి 21 వరకు కొనసాగుతాయని వివరించారు. అత్యంత ముఖ్య ఘట్టమైన రామ్ లల్లా విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ఠ’ మహోత్సవం జనవరి 22 న నిర్వహించనున్నట్లు ట్రస్ట్ అధికారులు తెలిపారు. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన “యజ్ఞం”లో పాల్గొంటారని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..