AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనలు.. ఇక దానికి ఆధార్‌ ఫ్రూఫ్‌ చెల్లుబాటు కాదు

వివిధ న్యాయస్థానాలు ఆధార్ చట్టం 2016పై అనేకసార్లు వైఖరిని స్పష్టం చేశాయి. ఇటీవల బాంబే హైకోర్టు కూడా మహారాష్ట్ర వర్సెస్‌ యూఐడీఏఐ, ఇతర కేసులలో ఆధార్ నంబర్‌ను గుర్తింపు కార్డుగా ఉపయోగించాలని, జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదని తెలిపింది. దీని తరువాత యూఐడీఏఐ డిసెంబర్ 22, 2023 న ఒక సర్క్యులర్ జారీ చేసింది..

EPFO: ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనలు.. ఇక దానికి ఆధార్‌ ఫ్రూఫ్‌ చెల్లుబాటు కాదు
Epfo
Subhash Goud
|

Updated on: Jan 18, 2024 | 11:24 AM

Share

ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. ఆధార్‌ కార్డు గురించి ఎప్పటికప్పుడు కీలక అప్‌డేట్స్‌ వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆధార్‌ను అన్ని రకాల వాటికి అనుసంధానించడం తప్పనిసరి అయిపోయింది. బ్యాంకు అకౌంట్‌ నుంచి ఓటర్‌ ఐడి, పాన్‌ ఇలా రకరకాల వాటికి ఆధార్‌ అనుసంధానించడం తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు విషయంలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO)ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పుట్టిన తేదీని అప్‌డేట్‌ చేసేందుకు, లేదా సవరించేందుకు ఆధార్‌ కార్డు చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. అంటే EPFO ​​ఇకపై ఈ ప్రయోజనం కోసం ఆధార్ కార్డును ఉపయోగించదు. ఈపీఎఫ్‌వో చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి మినహాయించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అసోసియేషన్ సర్క్యులర్ కూడా జారీ చేసింది.

కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే EPFO ​​ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ ఉపయోగించి పుట్టిన తేదీని మార్చలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో తాజాగా ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం యూఐడీఏఐ నుంచి లేఖ కూడా అందింది. పుట్టిన తేదీని మార్చుకుంటే ఆధార్ కార్డు చెల్లదని పేర్కొంది. ఇది చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి తీసివేయాలని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ పత్రాలు అవసరం

ఇవి కూడా చదవండి

EPFO వివరాల ప్రకారం.. ఈ మార్పు చేసుకునేందుకు జనన ధృవీకరణ పత్రం ద్వారా చేసుకోవచ్చు. ఇదే కాకుండా మార్క్ షీట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా ఏదైనా ప్రభుత్వ బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి పొందిన పాఠశాల బదిలీ సర్టిఫికేట్ కూడా ఈ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, పాన్ నంబర్, ప్రభుత్వ పెన్షన్ సర్టిఫికేట్‌, మెడిక్లెయిమ్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చని తెలిపింది.

ఆధార్ ఏ ప్రయోజనం కోసం ఉపయోగం

ఆధార్ కార్డునే గుర్తింపు కార్డుగా, నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించాలని యూఐడీఏఐ తెలిపింది. కానీ, దానిని జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదు. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు. ఇది భారత ప్రభుత్వంచే జారీ చేయబడింది. ఇది మీ గుర్తింపు, శాశ్వత నివాసానికి రుజువుగా దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. అయితే, ఆధార్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు, వ్యక్తులు వివిధ పత్రాల ప్రకారం వారి పుట్టిన తేదీని నమోదు చేశారు. అందుకే ఇది జనన ధృవీకరణ పత్రానికి ప్రత్యామ్నాయంగా పరిగణించరాదని తెలిపింది.

కోర్టు నుంచి అదే ఆదేశాలు:

ఇదిలా ఉండగా, వివిధ న్యాయస్థానాలు ఆధార్ చట్టం 2016పై అనేకసార్లు వైఖరిని స్పష్టం చేశాయి. ఇటీవల బాంబే హైకోర్టు కూడా మహారాష్ట్ర వర్సెస్‌ యూఐడీఏఐ, ఇతర కేసులలో ఆధార్ నంబర్‌ను గుర్తింపు కార్డుగా ఉపయోగించాలని, జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదని తెలిపింది. దీని తరువాత యూఐడీఏఐ డిసెంబర్ 22, 2023 న ఒక సర్క్యులర్ జారీ చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!