Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pension Scheme: చిన్న రైతులకు ప్రభుత్వం నుండి రూ.3000 పెన్షన్.. దరఖాస్తు చేసుకోండిలా!

రైతులు తమ సమీప రైతు సంప్రదింపు కేంద్రానికి వెళ్లాలి. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి. రైతుల వయస్సు ప్రకారం, వారు చెల్లించాల్సిన కనీస మొత్తం నిర్దేశిస్తారు. ఈ నమోదులో గ్రామ స్థాయి పారిశ్రామికవేత్త సహాయం చేస్తారు. అర్హులైన రైతులు వ్యాపారవేత్తకు మొదటి విడత నగదు చెల్లించాలి. ఆ తర్వాత ఆటో డెబిట్ అప్లికేషన్ నింపి సమర్పించాలి..

Pension Scheme: చిన్న రైతులకు ప్రభుత్వం నుండి రూ.3000 పెన్షన్.. దరఖాస్తు చేసుకోండిలా!
Pension Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Jan 18, 2024 | 12:23 PM

ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనతో పాటు అనేక పథకాలను అమలు చేసింది. అందులో ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి. కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధానమంత్రి కిసాన్ మనధన్ యోజన రెండూ భిన్నమైనవి. కానీ రెండూ 2019లోనే ప్రారంభమయ్యాయి. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం సంవత్సరానికి రూ.6,000 అందజేస్తుంది. అయితే, పీఎం కిసాన్ మనధన్ యోజన కింద చిన్న రైతులకు నెలవారీ రూ.3,000 పెన్షన్ అందిస్తోంది.

ప్రధానమంత్రి కిసాన్ మనధన్ యోజన అంటే ఏమిటి?

ఇందులో రెండు హెక్టార్లు లేదా ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు, 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు ప్రధాన మంత్రి కిసాన్ మనధన్ యోజనలో నమోదు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఈ పథకంలో 19,47,588 మంది రైతులు నమోదు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇందులో అర్హులైన రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు పింఛను నిధికి జమ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తాన్ని నిధికి అందిస్తుంది. మీరు 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకాన్ని ప్రారంభిస్తే, మీరు నెలకు కనీసం రూ.55 చెల్లించాలి. మీరు 40 సంవత్సరాల వయస్సులో పథకాన్ని పొందినట్లయితే, మీరు నెలకు కనీసం రూ. 200 చెల్లించాలి. 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా పెన్షన్ ఫండ్‌లో చెల్లించాలి. ఆ తర్వాత రైతులు నెలవారీ పింఛను రూ.3,000 లేదా అంతకంటే ఎక్కువ పొందవచ్చు.

PM కిసాన్ మనధన్ యోజనలో ఎలా నమోదు చేసుకోవాలి?

రైతులు తమ సమీప రైతు సంప్రదింపు కేంద్రానికి వెళ్లాలి. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి. రైతుల వయస్సు ప్రకారం, వారు చెల్లించాల్సిన కనీస మొత్తం నిర్దేశిస్తారు. ఈ నమోదులో గ్రామ స్థాయి పారిశ్రామికవేత్త సహాయం చేస్తారు. అర్హులైన రైతులు వ్యాపారవేత్తకు మొదటి విడత నగదు చెల్లించాలి. ఆ తర్వాత ఆటో డెబిట్ అప్లికేషన్ నింపి సమర్పించాలి. ఆ తర్వాత ప్రతి నెలా కూడా ఎస్‌బీ ఖాతా నుంచి కొంత మొత్తం పెన్షన్‌ ఫండ్‌కు చేరుతుంది. పథకంలో నమోదు చేసుకున్న తర్వాత, రైతుల కోసం ప్రత్యేక కిసాన్ పెన్షన్ ఖాతా సంఖ్య (KPAN) జనరేట్‌ అవుతుంది. ఆ తర్వాత కిసాన్ కార్డు జారీ చేస్తారు అధికారులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
విజయాల లక్నో, పరాజయాల చెన్నై.. గెలుపు ఎవరిదో తెలుసుగా మచ్చా?
విజయాల లక్నో, పరాజయాల చెన్నై.. గెలుపు ఎవరిదో తెలుసుగా మచ్చా?
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా