Telangana: హెల్త్ కేర్ రంగంలో భారీ పెట్టుబడులు.. తెలంగాణలో రూ.231.5 కోట్లతో డివైజెస్ తయారీ కేంద్రం

యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (SIGH) హైదరాబాద్‌లో తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడ తయారు చేయాలని నిర్ణయించింది.

Telangana: హెల్త్ కేర్ రంగంలో భారీ పెట్టుబడులు.. తెలంగాణలో రూ.231.5 కోట్లతో డివైజెస్ తయారీ కేంద్రం
Revanth Reddy With Sigh
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 18, 2024 | 6:18 PM

యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (SIGH) హైదరాబాద్‌లో తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడ తయారు చేయాలని నిర్ణయించింది. రాబోయే రెండు మూడు ఏండ్లలో అందుకు అవసరమయ్యే రూ.231.5 కోట్ల పెట్టుబడులు పెడుతామని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ ఫెసిలిటీ ఏర్పాటుతో హెల్త్ కేర్ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేయనుంది.

దావోస్‌లో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో SIGH ఎండీ గౌరీ శ్రీధర, డైరెక్టర్ అమర్ చీడిపోతు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పడానికి కావల్సిన అన్నీ రంగాల మౌళిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో SIGH సంస్థ తెలంగాణలో భారీగా పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

ఈ ప్రాజెక్టు మొదటి దశలో జనరల్ సర్జికల్ పరికరాలు, మైక్రో సర్జరీకి ఉపయోగించే అధునాతన పరికరాలను తయారు చేస్తారు. ఆర్థోపెడిక్, చర్మ, నేత్ర సంబంధిత సున్నితమైన సర్జరీలకు అవసరమయ్యే తయారు చేస్తుంది. రెండో దశలో రోబోటిక్ వైద్య పరికరాలను తయారీ చేసేలా యూనిట్ ను విస్తరిస్తారు. SIGH కంపెనీ యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్, అక్కడి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (ఆర్మీ) హాస్పిటళ్లకు, ప్రైవేట్ హాస్పిటళ్లకు తమ పరికరాలను సరఫరా చేస్తోంది.