Watch Video: స్పేస్ హీరో శుభాన్షు శుక్లాను కలిసిన ప్రధాని మోదీ.. ఆక్సియం 4 యాత్ర విజయం పట్ల ప్రత్యేక అభినందనలు
PM Modi meets Shubhanshu Shukla: ఆక్సియం-4 అంతరిక్ష యాత్రకు పైలట్‌గా పనిచేసిన వ్యోమగామి శుభాన్షు శుక్లా ఆదివారం స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (ఆగస్ట్ 18) ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా శుభాన్షు శుక్లా ఆక్సియం-4 మిషన్ ప్యాచ్‌ను ప్రధాని మోదీకి అందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన భూమి చిత్రాలతోపాటు..

న్యూఢిల్లీ, ఆగస్ట్ 18: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు ఆక్సియం-4 అంతరిక్ష యాత్రకు పైలట్‌గా పనిచేసిన వ్యోమగామి శుభాన్షు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (ఆగస్ట్ 18) ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా శుభాన్షు శుక్లా ఆక్సియం-4 మిషన్ ప్యాచ్‌ను ప్రధాని మోదీకి అందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన భూమి చిత్రాలతోపాటు రోదసీ యాత్ర ప్రయాణ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. యాత్ర విజయవంతంపై మోదీ ఆయన్ను అభినందించారు. ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా నిలిచిన శుక్లా ఆదివారం తెల్లవారుజామున ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయనకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా జూన్ 25 నుంచి జూలై 15 వరకు కొనసాగిన అంతరిక్ష విమానయానం కోసం అమెరికాలో దాదాపు ఏడాదిపాటు శుక్లా శిక్షణ తీసుకున్నారు. ఎర్రకోటలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ఈ విషయంపై కీలక విషయాలను ప్రస్తావించారు. శుక్రవారం నాటి మోదీ ప్రసంగంలో భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేస్తోందని అన్నారు. గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతరిక్ష యాత్ర నుంచి తిరిగి వచ్చారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆయన భారత్‌కు తిరిగి వస్తారని మోదీ అన్నారు. శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరిగింది.
#WATCH | Group Captain Shubhanshu Shukla, who was the pilot of Axiom-4 Space Mission to the International Space Station (ISS), meets Prime Minister Narendra Modi. pic.twitter.com/0uvclu9V2b
— ANI (@ANI) August 18, 2025
ఆక్సియం-4 మిషన్ కింద అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా నిలిచిన శుక్లా, అతని సహ వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌లను విమానాశ్రయంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఘనంగా స్వాగతించారు. శుక్లాను స్వాగతం పలకడానికి ఎయిర్ పోర్టులో ఆయన భార్య కామ్నా, కుమారుడు కియాష్ కూడా వచ్చారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ భారీ సంఖ్యలో జనం గుమిగూడి శుక్లాను ఘనంగా స్వాగతించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








