సమాచారవిప్లవంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా ఉంటుందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో ఇండియా 6జి విజన్ డాక్యుమెంట్‌ని ఆవిష్కరించారు. 6జి ఆర్&డి టెస్ట్ బెడ్‌ను ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. 6G విజన్ డాక్యుమెంట్‌ను ఢిల్లీలో విడుదల చేశారు. 2028-29 వరకు భారత్‌లో 6G సేవలు తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. 6G రీసెర్చ్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు.
గ్లోబల్ సౌత్ సమిట్‌ను భారత్ విజయవంతంగా నిర్వహించిందన్నారు ప్రధాని మోదీ. భారత్‌లో చాలామంది ప్రజలు కొత్త ఏడాది వేడుకలను జరుపుకుంటున్నారు.. ఈ శుభసమయంలో 6G రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోదీ. అతితక్కువ ధరకే భారత్‌లో డేటా లభ్యమవుతోందన్నారు.
గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రజలే ఎక్కవగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని తెలిపారు. దేశంలో 2 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ సేవలు అందాయని చెప్పారు. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు కూడా బాగా పెరిగారని అన్నారు ప్రధాని మోదీ.
Speaking at inauguration of ITU Area Office & Innovation Centre in Delhi. Initiatives like 6G Test Bed & ‘Call Before You Dig’ app are also being launched. https://t.co/z6hRdeTPbB
— Narendra Modi (@narendramodi) March 22, 2023
ITU అనేది సమాచార, సమాచార సాంకేతికత (ICT) కోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీ. ఈ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఏజెన్సీ క్షేత్ర కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాలు, ప్రాంత కార్యాలయాల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతదేశం 2022 మార్చిలో ఏరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ITUతో చేతులు కలిపింది.
టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ ద్వారా తయారు చేయబడిన ఇండియా 6G విజన్ డాక్యుమెంట్ 6G (TIG-6G), వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, విద్యాసంస్థలు, స్టాండర్డైజేషన్ బాడీలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, పరిశ్రమల సభ్యులతో నవంబర్ 2021లో రూపొందించబడింది. 6G చేయడం, ప్లాన్ చేయడం కోసం. 6G టెస్ట్ బెడ్ విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, MSMEలు మొదలైనవాటికి అభివృద్ధి చెందుతున్న ICT సాంకేతికతలను పరీక్షించడానికి… ధృవీకరించడానికి ఒక వేదికను అందిస్తుంది. భారత్ 6G విజన్ డాక్యుమెంట్, 6G టెస్ట్ బెడ్ దేశంలో కొత్త ఆవిష్కరణలు, వేగవంతమైన సాంకేతికతను స్వీకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది.
ఆసక్తికర విషయం ఏంటంటే, 6G కమర్షియల్ రోల్ అవుట్‌కు చాలా ఇంకా సంవత్సరాల దూరంలో ఉంది. 2028 లేదా 2029 తర్వాత 6జీని ప్రారంభించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల టెక్నాలజీ 5Gలో పని చేస్తోంది. భారతదేశం కూడా 2022 చివరి నాటికి తన 5G సేవను ప్రారంభించింది. అయితే, Airtel, Jio రెండూ తమ కస్టమర్లకు అపరిమిత 5Gని అందిస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి దేశం మొత్తాన్ని 5జీతో కవర్ చేయాలని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం