AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: వారి వల్లే ఇదంతా.. శ్రమజీవులను ఘనంగా సత్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ..

PM Modi felicitates Shramjeevis: భారత్‌లో జీ20 సమ్మిట్ సెప్టెంబరులో జరగనుంది. ఈ కీలక శిఖరాగ్ర సమావేశం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. అయితే, ఈ సమావేశాలకు ఢిల్లీలోని రీ డెవలప్‌డ్ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) కాంప్లెక్స్‌ వేదిక కానుంది.

PM Modi: వారి వల్లే ఇదంతా.. శ్రమజీవులను ఘనంగా సత్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Jul 26, 2023 | 1:54 PM

Share

PM Modi felicitates Shramjeevis: భారత్‌లో జీ20 సమ్మిట్ సెప్టెంబరులో జరగనుంది. ఈ కీలక శిఖరాగ్ర సమావేశం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. అయితే, ఈ సమావేశాలకు ఢిల్లీలోని రీ డెవలప్‌డ్ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) కాంప్లెక్స్‌ వేదిక కానుంది. ITPO కాంప్లెక్స్ (ప్రగతి మైదాన్ కాంప్లెక్స్) ను దాదాపు 123 ఎకరాల విస్తీర్ణంలో .. అత్యంత సుందరంగా పునఃర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్ద కాంప్లెక్స్‌ లలో ఐటీపీఓ కాంప్లెక్స్ MICE (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు) ఒకటిగా నిలవనుంది. రూ.2700 కోట్ల వ్యయంతో భారతదేశ సంస్కృతి, కళలను చాటిచెప్పేలా కన్వెన్షన్‌ సెంటర్‌ను అత్యాధునికంగా సకల సౌకర్యాలతో పునర్‌నిర్మించారు. కాగా.. ITPO కాంప్లెక్స్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజాకార్యక్రమాల్లో పాల్గొని ప్రధాని మోడీ పూజలు చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ అతిపెద్ద ఐటీపీఓ కాంప్లెక్స్ MICE పునర్‌నిర్మాణంలో భాగస్వామ్యమైన శ్రమజీవులను ఘనంగా సత్కరించారు. కార్మికుల కష్టాన్ని గుర్తించడంతోపాటు.. వారికి ప్రాధాన్యత ఇచ్చేలా ప్రధాని మోడీ ఎంఐసీఈ పనుల్లో పాల్గొన్న వారందరినీ శాలువాలతో సత్కరించారు. అంతకుముందు కూడా ప్రధాని మోడీ.. నూతన పార్లమెంట్‌ నిర్మాణంలో భాగస్వామ్యమైన కార్మికులను సత్కరించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి
Pm Narendra Modi

Pm Narendra Modi

ఐటీపీఓ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంతోపాటు ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోడీ G20 స్టాంప్, నాణేలను కూడా విడుదల చేయనున్నారు. అనంతరం అంటే రాత్రి 7:05 గంటలకు ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..