PM Modi: బాల రాముడిపై సూర్యతిలకాన్ని దర్శించిన ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్..

ప్రధాని మోదీ బుధవారం అసోంలోని నల్భరీలో ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. అయితే ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో ఏర్పడే అద్భుత ఘట్టాన్ని నేరుగా తిలకించలేకపోయారు. కానీ ఎన్నికల షెడ్యూల్‎లో బిజీగా ఉన్నప్పటికీ అసోంలోని నల్బరీ ర్యాలీలో పాల్గొన్న తరువాత తిరుగుప్రయాణంలో తన ప్రత్యేక హెలీకాఫ్టర్‎లో అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ.

PM Modi: బాల రాముడిపై సూర్యతిలకాన్ని దర్శించిన ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్..
Pm Modi
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 17, 2024 | 2:33 PM

ప్రధాని మోదీ బుధవారం అసోంలోని నల్భరీలో ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. అయితే ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో ఏర్పడే అద్భుత ఘట్టాన్ని నేరుగా తిలకించలేకపోయారు. కానీ ఎన్నికల షెడ్యూల్‎లో బిజీగా ఉన్నప్పటికీ అసోంలోని నల్బరీ ర్యాలీలో పాల్గొన్న తరువాత తిరుగుప్రయాణంలో తన ప్రత్యేక హెలీకాఫ్టర్‎లో అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. తన ప్రత్యేక హెలీకాఫ్టర్‎లో ట్యాబ్ ద్వారా ఆన్లైన్‎లో బాలరాముడిపై సూర్య కిరణ తిలకాన్ని చూసి మురిసి పోయారు. ఈ సందర్భంగా యావత్ ప్రపంచం ఈ మహాద్భుతమైన ఘట్టాన్ని వీక్షించడం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోందని తెలిపారు. అయితే ఈ సుందర ఘట్టంలో నేరుగా పాల్గొనే అవకాశం లేకపోయినప్పటికీ ఇలా ఒక మాధ్యమంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం లభించింది అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన చేతిని హృదయంపై ఉంచి కాళ్లకు ఉన్న బూట్లను తీసి పక్కన పెట్టి బాలరాముడిని మనసా, వాచా, కర్మణా స్మరిస్తూ కొన్ని క్షణాలు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయారు ప్రధాని మోదీ.

అయోధ్యలో అద్భుతం జరిగింది. బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం కనువిందు చేసింది.. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ నవమి సందర్భంగా బాలరాముడికి ఆ సూర్య భగవానుడే తిలకం దిద్దాడు. కేవలం కొద్దిక్షణాలు మాత్రమే ఆవిష్కృతమైన ఈ అద్భుత సమయంలో దగదగా మెరిసిపోతున్న రామయ్య దివ్యమంగళ రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత జరుగుతున్న మొదటి శ్రీరామనవమి ఇదేకావడంతో భక్తులు ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద ఎత్తున అయోధ్య చేరుకున్నారు. ఈ శ్రీరామనవమి వేడుకల్లోనే హైలైట్‎గా నిలిచింది ‘సూర్య తిలకం’. ఆ సూర్యభగవానుడే అయోధ్య గర్భగుడిలో కొలువవైన శ్రీరాముడికి తన కిరణాలతో తిలకం దిద్దాడు. అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. 51 అంగుళాల పొడవుతో ఉన్న 5 ఏళ్ల బాలరాముని నుదిటిపై నేరుగా సూర్య కిరణాలు పడ్డాయి. సరిగ్గా నుదుటిపై బొట్టులా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో నాలుగు నిమిషాలపాటు ప్రసరించాయి. విగ్రహం నీలం రంగులోకి మారి మరింత అందంగా దర్శనమించాడు బాలరాముడు. దీన్ని కన్నులారా చూసిన భక్తులు.. మరింత భక్తి భావంతో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

అయోధ్య రామమందిరం దేశ ప్రజల దశాబ్దాల కల. దాన్ని నెరవేరుస్తూ రామజన్మభూమిలో భవ్య రామమందిర నిర్మాణం జరిగింది. ఇలా నిర్మించిన రామాలయం అద్భుత శిల్పకళా సంపదతో అందంగానే కాదు మరెన్నో ప్రత్యేకతలు కలిగివుంది. అందులో ఎంతో కీలకమైనది ఈ ‘సూర్యతిలకం. రఘువంశోత్తముడైన ఆ బాలరాముడి కొలువైన గర్భగుడిలోకి సరిగ్గా శ్రీరామనవమి రోజు సూర్య కిరణాలు ప్రసరించేలా ఏర్పాట్లు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇలా నేడు శ్రీరామ నవమి సందర్భంగా సరిగ్గా 12 గంటలకు అయోధ్య బాలరాముడికి సూర్యకిరణాలు తిలకం దిద్దాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని స్పూన్ల చక్కెర తీసుకోవాలి?
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని స్పూన్ల చక్కెర తీసుకోవాలి?
అదితీరావు మొదటి భర్త కూడా ఫేమస్ నటుడే.. ఆ నటితో రెండో పెళ్లి కూడా
అదితీరావు మొదటి భర్త కూడా ఫేమస్ నటుడే.. ఆ నటితో రెండో పెళ్లి కూడా
గుండెకు సూపర్‌ ఫుడ్.. కానీ, ఎక్కువ తీసుకుంటేనే డేంజర్..
గుండెకు సూపర్‌ ఫుడ్.. కానీ, ఎక్కువ తీసుకుంటేనే డేంజర్..
ఈ భంగిమల్లో నిద్ర.. మీ వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేస్తది..
ఈ భంగిమల్లో నిద్ర.. మీ వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేస్తది..
ఈ ఆకు నానబెట్టిన నీళ్లు తాగితే ఒంట్లో కొవ్వు వెన్నలా కరిగిపోతుంది
ఈ ఆకు నానబెట్టిన నీళ్లు తాగితే ఒంట్లో కొవ్వు వెన్నలా కరిగిపోతుంది
ఇంట్లో చనిపోయిన వారి ఫొటోలు పెడుతున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించండి
ఇంట్లో చనిపోయిన వారి ఫొటోలు పెడుతున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించండి
వేళాపాళా లేకుండా ఎప్పుడంటే అప్పుడు స్నానం చేస్తున్నారా?
వేళాపాళా లేకుండా ఎప్పుడంటే అప్పుడు స్నానం చేస్తున్నారా?
ఉదయం లేవగానే వికారంగా ఉంటుందా.? ఇదే కారణం కావొచ్చు..
ఉదయం లేవగానే వికారంగా ఉంటుందా.? ఇదే కారణం కావొచ్చు..
'కొంత మంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు'..
'కొంత మంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు'..
అమ్మవారే బాలిక రూపంలో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తుందట ఎక్కడంటే
అమ్మవారే బాలిక రూపంలో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తుందట ఎక్కడంటే