AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీ స్వాహా.. వెలుగులోకి రూ.100 కోట్ల భారీ కుంభకోణం

తిరుమల శ్రీవారి పరకామణి నుంచి విదేశీ కరెన్సీని కాజేసిన రవికుమార్ వ్యవహారం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. పరకామణిలో పెద్ద జీయర్ తరుపున విధుల్లో ఉన్న సీవీ రవికుమార్ గత కొనేళ్ళుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు 2023 ఏప్రిల్ 29న కేసు నమోదు అయ్యింది.

Andhra News: శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీ స్వాహా.. వెలుగులోకి రూ.100 కోట్ల భారీ కుంభకోణం
Tirumala Foreign Scam
Raju M P R
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Dec 25, 2024 | 6:26 PM

Share

తిరుమల శ్రీవారి పరకామణి నుంచి విదేశీ కరెన్సీని కాజేసిన రవికుమార్ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. 2023 ఏప్రిల్‌లో వెలుగులోకి వచ్చిన పరకామణి చోరీ కేసుపై ఎంక్వయిరీ కమిషన్‌‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో చర్చగా మారింది. రూ. 100 కోట్ల విలువైన పరకామణి స్కాంలోని పెద్దల పని తేల్చాలని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ డిమాండ్ చేస్తున్నారు. ఎవరి ఒత్తిడితో కేసును నీరుగార్చారని ఆయన ఆరోపిస్తున్నారు.

తిరుమల శ్రీవారి హుండీలో భక్తుల సమర్పించే కానుకలను లెక్కించే పరకామణిలో జరిగిన చోరీ ఇప్పుడు చర్చకు వచ్చింది. పరకామణిలో జరిగే లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే పెద్ద జీయర్ మఠానికి చెందిన ఉద్యోగి రవికుమార్ చేతివాటం వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలంటున్న టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ డిమాండ్‌తో మరోసారి తెర మీదకు వచ్చింది. 2023 ఏప్రిల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఇచ్చిన నివేదిక, లోకయుక్తాలో జరిగిన రాజీ వ్యవహారంపై ఎంక్వయిరీ కమిషన్‌కు డిమాండ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పరకామణిలో పెద్ద జీయర్ తరుపున విధుల్లో ఉన్న సీవీ రవికుమార్ గత కొనేళ్ళుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు 2023 ఏప్రిల్ 29న కేసు నమోదు అయ్యింది.

విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు కాగా నిందితుడు రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే రవికుమార్‌ను అరెస్టు చేయకుండా 2023 సెప్టెంబర్‌లో లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడాన్ని టీటీడీ పాలకమండలి సభ్యుడు బాను ప్రకాష్ ప్రశ్నించడంతో వ్యవహారం వెలుగులకు వచ్చింది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి ఛైర్మన్, ఈఓకు ఫిర్యాదు చేసిన భాను ప్రకాష్ ఎంక్వయిరీ కమిషన్‌‌ను డిమాండ్ చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తామంటున్న భాను ప్రకాష్ విజిలెన్స్ ఇచ్చిన నివేదికను తప్పుపడుతున్నారు.

టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల 2023 ఏప్రిల్ 29న రవి కుమార్2పై కేసు నమోదు అయింది. ఐపీసీ 370, 381 సెక్షన్2ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను విచారించడంతో అవినీతి బయటపడింది. ఈ మేరకు పరకామణి నుంచి కాజేసిన సొమ్ముతో కొన్న ఆస్తులను టీటీడీకి బదిలీ చేసేందుకు రవికుమార్ అంగీకరించడంతో తిరుపతిలోని అశోక అపార్ట్మెంట్, పసుపర్తి పనోరమ అపార్ట్మెంట్స్‌లోని 14 ప్లాట్లను టీటీడీ స్వాధీనం చేసుకుంది. డబుల్ బెడ్ రూమ్, త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్లను రవికుమార్ డొనేట్ చేసినట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంది. తిరుపతితో పాటు చెన్నై, ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు రూ. 40 కోట్ల ఆస్తులను టీటీడీకి బదిలీ కాగా ఈ మొత్తం వ్యవహారం అటు శాసనమండలిలోనూ చర్చకు వచ్చింది. తిరుమల శ్రీవారి పరకామణిలో రూ 100 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలతో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు చర్చగా మారింది. పోలీసుల నుంచి ఒత్తిడి వచ్చిందన్న కామెంట్స్ చర్చగా మారాయి. ఏప్రిల్‌లో కేసు నమోదు అయితే సెప్టెంబర్లో 5 నెలల లోపే లోకాయుక్తాలో రాజీ కావడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్న టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంక్వైరీ కమిషన్‌కు పట్టుబడుతున్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విచారణ జరపాలని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి కోరుతామన్నారు,

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి