Asian Games 2023: భారత క్రీడాకారులకు ప్రధాని మోదీ అభినందనలు..‘ఇది యావత్ దేశం గర్వించదగ్గ క్షణం’ అంటూ..

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు రాణిస్తున్నారు. సెప్టెంబర్ 23 నుంచి జరుగుతున్న ఈ క్రీడల్లో భారత ప్లేయర్లు ఇప్పటికే 16 గోల్డ్, 26 సిల్వర్, 31 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. అక్టోబర్ 8 వరకు జరిగే ఆసియా క్రీడల్లో మన ప్లేయర్లు మరిన్ని మెడల్స్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఆసియా క్రీడల్లో భారత్ ఇన్ని మెడల్స్ గెలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం. చివరిసారిగా భారత్ 2018 ఆసియా క్రీడల్లో..

Asian Games 2023: భారత క్రీడాకారులకు ప్రధాని మోదీ అభినందనలు..‘ఇది యావత్ దేశం గర్వించదగ్గ క్షణం’ అంటూ..
PM Modi Congratulates Indian Athletes
Follow us

|

Updated on: Oct 04, 2023 | 1:20 PM

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు రాణిస్తున్నారు. సెప్టెంబర్ 23 నుంచి జరుగుతున్న ఈ క్రీడల్లో భారత ప్లేయర్లు ఇప్పటికే 16 గోల్డ్, 26 సిల్వర్, 31 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. అక్టోబర్ 8 వరకు జరిగే ఆసియా క్రీడల్లో మన ప్లేయర్లు మరిన్ని మెడల్స్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఆసియా క్రీడల్లో భారత్ ఇన్ని మెడల్స్ గెలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం. చివరిసారిగా భారత్ 2018 ఆసియా క్రీడల్లో 70 మెడల్స్ గెలుచుకుంది. ఇందులో 16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్ ఉన్నాయి. ఇలా గత రికార్డులను బ్రేక్ చేసి 70 ప్లస్ మెడల్స్‌ని భారత ప్లేయర్లు గెలిచిన సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘ఆసియా క్రీడల్లో భారత్ ముందెన్నడూ లేనివిధంగా ప్రకాశిస్తోంది. భారత్ సాధించిన 71 పతకాలు మన అథ్లెట్ల అసమానమైన అంకితభావం, క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. ఇది భారత్‌కి అత్యుత్తమ మెడల్స్ గణాంకాలు. భారత్ గెలిచిన ప్రతి పతకం మన అథ్లెట్ల కృషి, అభిరుచి గురించి చాటిచెబుతోంది. ఇది యావత్ దేశం గర్వించదగ్గ క్షణం. భారత క్రీడాకారులకు అభినందనలు’ అంటూ ప్రధాని మోదీ తెలిపారు.

అలాగే అంతకముందు ఆసీయా క్రీడల్లో అర్చరీలో గోల్డ్ మెడల్స్ సాధించిన భారత ఆర్చర్లు ఓజాస్ డియోటాలే, జ్యోతి సురేఖ వెన్నమ్‌‌ జోడిని కూడా ప్రధాని మోదీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. భారత ఆర్చర్ల అసాధారణ నైపుణ్యం, ఖచ్చితత్వం,  కృషి కారణంగానే ఇలాంటి గొప్ప ఫలితం సాధ్యమైందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..