Vande Bharat Express: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో స్లీపర్ కోచ్‌లతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
Vande Bharat Express: వందేభారత్ ట్రెయిన్స్‌తో వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న భారతీయ రైల్వే సౌకర్యాల విషయంలో మరో అడుగు వేయబోతోంది. స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ కాన్సెప్ట్ ట్రెయిన్స్ 2024లో పట్టాలెక్కనున్నాయి. ఈ కొత్త రైళ్లకు సంబంధించిన ఫొటోలను రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు.

Vande Bharat Express: వందేభారత్ ట్రెయిన్స్‌తో వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న భారతీయ రైల్వే సౌకర్యాల విషయంలో మరో అడుగు వేయబోతోంది. స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ కాన్సెప్ట్ ట్రెయిన్స్ 2024లో పట్టాలెక్కనున్నాయి. ఈ కొత్త రైళ్లకు సంబంధించిన ఫొటోలను రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు. అన్ని సవ్యంగా సాగితే వచ్చే మార్చిలో ఈ రైలు పరుగులుదీయవచ్చు.
ఇండియన్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ – రష్యాకు చెందిన TMH గ్రూప్ సంయుక్తంగా ఈ స్లీపర్ కోచ్‌లు తయారు చేస్తున్నాయి. మొత్తం 200 రైళ్లకుగాను 120 రైళ్లను రష్యా సంస్థ తయారు చేయనుంది. మిగిలిన 80 రైళ్లను టిటాగఢ్ వ్యాగన్స్, BHEL సంస్థలతో కూడిన కన్సార్షియం తయారు చేస్తుంది. ఈ కొత్త స్లీపర్ వందే భారత్ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి.
ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లలో 857 బెర్తులు ఉంటాయి. ఇందులో 34 బెర్తులు సిబ్బంది కోసం కేటాయిస్తారు. అంటే మొత్తం 887 మంది ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. ప్రతీ కోచ్‌లో మూడు టాయిలెట్స్ ఉంటాయి. మొత్తం 16 బోగిలతో నడిచే ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 400 వందే భారత్ స్లీపర్ వెర్షన్ ట్రైన్లకు టెండర్లు పిలిచింది ప్రభుత్వం. కాగా, కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Concept train – Vande Bharat (sleeper version)
Coming soon… early 2024 pic.twitter.com/OPuGzB4pAk
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 3, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..