PM Modi: దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఇదే..

18వ లోక్‌సభ సమావేశాలు వాడిగావేడిగా మొదలయ్యాయి. సభ కొత్తదయినా, వేడి మాత్రం రీ ఫ్రెష్‌ అయింది. విపక్షాలు ధర్నా మొదలుపెట్టడానికి ముందే, ప్రధాని మోదీ బౌన్సర్‌ వేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి రేపటికి 50 ఏళ్లని సందర్భంగా, ఈ అంశాన్ని ప్రస్తావించి విపక్షంపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని ముక్కలు చేసి, దేశాన్ని ఒక జైలుగా మార్చిన ఎమర్జెన్సీ అనే మచ్చ ఏర్పడి రేపటికి 50 ఏళ్లు అవుతుందని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi: దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఇదే..
Pm Modi Rahul Gandhi
Follow us

|

Updated on: Jun 24, 2024 | 1:41 PM

Parliament Session 2024: 18వ లోక్‌సభ సమావేశాలు వాడిగావేడిగా మొదలయ్యాయి. సభ కొత్తదయినా, వేడి మాత్రం రీ ఫ్రెష్‌ అయింది. విపక్షాలు ధర్నా మొదలుపెట్టడానికి ముందే, ప్రధాని మోదీ బౌన్సర్‌ వేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి రేపటికి 50 ఏళ్లని సందర్భంగా, ఈ అంశాన్ని ప్రస్తావించి విపక్షంపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని ముక్కలు చేసి, దేశాన్ని ఒక జైలుగా మార్చిన ఎమర్జెన్సీ అనే మచ్చ ఏర్పడి రేపటికి 50 ఏళ్లు అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. 50 ఏళ్లనాటి తప్పును పునరావృతం చేసే సాహసం మున్ముందు ఎవరూ చేయకుండా దేశ ప్రజలు సంకల్పం తీసుకుంటారని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజలను నినాదాలు అవసరం లేదనీ, విధానాలు కావాలని, అందుకే విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ సూచించారు. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామని.. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సామాన్య ప్రజల ఆకాంక్షలకు తగినట్లు పనిచేయాలని ప్రధాని మోదీ కోరారు.. కాగా.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై విపక్షం నిరసన వ్యక్తంచేసింది.. రాజ్యాంగం ప్రతులను చేతపట్టుకుని.. కేంద్రం తీరుపై ఇండియా కూటమి నిరసన తెలిపింది. పార్లమెంటులోకి వెళ్లేముందు విపక్షాలు కలసికట్టుగానూ, విడివిడిగానూ ధర్నాచేశాయి. రాజ్యాంగాన్ని మోదీ సర్కారు కాలరాస్తోందని విమర్శించాయి. రాజ్యాంగం ప్రతులను చేతబూని, ఇండియా కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు.

రాజ్యాంగంపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా దాడులు చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు. ఈ దాడులు ఆమోదయోగ్యం కావన్నారు. దేశ రాజ్యాంగాన్ని ఏ శక్తి కూడా టచ్‌ చేయలేదని అన్నారు. ఎమర్జెన్సీ గురించి మోదీ ఇంకెన్నిసార్లు మాట్లాడతారంటూ కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ మల్లికార్జున ఖర్గే నిలదీశారు. మోదీ అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న తమ ప్రయత్నానికి ప్రజలు మద్దతు పలికారన్నారు ఖర్గే.

పార్లమెంట్‌లో లోక్‌సభ సభ్యుల ప్రమాణం స్వీకారం కొనసాగుతోంది. ప్రధాని మోదీతో ప్రమాణస్వీకారాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కేంద్ర మంత్రుల ప్రమాణాలు కొనసాగాయి.. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు తెలుగులో ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎంపీలుగా ప్రమాణం చేశారు. తొలిరోజున 280 మంది ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఇవాళ లోక్‌సభలో ఏపీ ఎంపీలు ప్రమాణం చేయనుండగా.. రేపు తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో చెప్పిన సల్మాన్ తండ్రి
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో చెప్పిన సల్మాన్ తండ్రి
కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??
అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??
చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్‌.. ఇదిగో వీడియో..
చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్‌.. ఇదిగో వీడియో..
కొంపముంచిన రీల్స్ సరదా.. కార్లతో సముద్రంలో చిక్కుకున్న యువకులు..!
కొంపముంచిన రీల్స్ సరదా.. కార్లతో సముద్రంలో చిక్కుకున్న యువకులు..!
గాల్లో పల్టీలు కొడుతున్న కార్లో స్టార్ హీరో.. వీడియో చూసి షాక్‌.!
గాల్లో పల్టీలు కొడుతున్న కార్లో స్టార్ హీరో.. వీడియో చూసి షాక్‌.!
కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.
కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.
ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్
ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్
కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్
కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్