PM Dhan Dhanya Krishi Yojana 2025: రైతన్నలకు గుడ్ న్యూస్.. పీఎం ధన్ ధాన్య యోజనకు మోదీ కేబినెట్ ఆమోదం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం ధన్ ధాన్య యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాలను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏటా రూ.24వేల కోట్ల వ్యయంతో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్‌ని అమలు చేయనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం ధన్ ధాన్య యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాలను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏటా రూ.24వేల కోట్ల వ్యయంతో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్‌ని అమలు చేయనున్నారు. 2025-26 నుంచి ఆరేళ్ల కాలానికి 100 జిల్లాలను కవర్ చేసేలా పీఎం ధన్ ధాన్య యోజన పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. గ్రీన్ ఎనర్జీ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. NTPC గ్రీన్ ఎనర్జీలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు నిర్ణయంచింది కేంద్ర కేబినెట్.. అలాగే, రోదసిలో 18 రోజులు గడిపి, అనేక ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమికి తిరిగివచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. కాగా.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ప్రతి రాష్ట్రంలో ఓ జిల్లాను పీఎం ధన్‌ధాన్య యోజన కింద వ్యవసాయ జిల్లాగా అభివృద్ది చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, గ్రామస్థాయిల్లో దిగుబడులను నిల్వ చేసేందుకు గోదాముల ఏర్పాటు – మౌలిక సదుపాయాల కల్పన, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, రుణ లభ్యతను సులభతరం చేయడమే లక్ష్యంగా పీఎం ధన్ ధాన్య కృషి యోజనను రూపొందించినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఉత్పాదకత తక్కువగా ఉండటం, అన్ని రుతువుల్లోనూ పంట సాగుబడి చేయకపోవడం, రుణ లభ్యత అత్యంత తక్కువగా ఉండటం అనే మూడు కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తించనున్నారు. ఈ పథకం సమర్థవంతంగా అమలు జరిగేలా పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ధన్-ధాన్య జిల్లాలో ఈ పథకం పురోగతిని 117 పెర్ఫామెన్స్ ఇండికేటర్ల ద్వారా పర్యవేక్షణ జరగనుంది. దీని ద్వారా ఏటా 1.7కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




