వీడేం మనిషి రా బాబు.. తల్లిదండ్రులను చంపి రాత్రంతా వారి మృతదేహాలతో..
ఒడిశాలో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను అతి కిరాతకంగా సుత్తితో కొట్టి హత్య చేసి.. ఆ తర్వాత రాత్రి మొత్తం వారి మృతదేహాల వద్దనే గడిపాడు. ఉదయం రక్తపుమడుగుల్లో తల్లిదండ్రుల పక్కన అతన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఒడిశాలో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను అతి కిరాతకంగా సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత రాత్రి మొత్తం వారి మృతదేహాల వద్దనే గడిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయూర్‌భంజ్ జిల్లా ధోనాపాల్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల హిమాన్షు వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనితో పాటు తల్లిదండ్రులు, అతని భార్య పిల్లలు ఉంటున్నారు. అయితే మద్యానికి బానిసైన హిమాన్షు రోజూ తాగి వచ్చి ఇంట్లో వాళ్లను వేధింపులకు గురిచేసేవాడు. హిమాన్షు తాగుడుతో విసిగిపోయిన అతని భార్య తన పిల్లలను తీసుకొని అతని నుంచి దూరంగా వెళ్లిపోయి విడిగా నివసిస్తోంది. దీంతో హిమాన్సు తాగుడు మరింత పెరిగిపోయింది.
ఇక రోజులానే మంగళవారం రాత్రి ఫుల్‌గా తాగి ఇంటికి వచ్చిన హిమాన్షు తన వృద్ధ తల్లిదండ్రులైన 81 ఏళ్ల హదిబంధు సాహు, 72 ఏళ్ల శాంతి సాహుతో గొడవకు దిగాడు. చాలా సేపు వాళ్లను వేధించాడు. తాగొద్దని తల్లిదండ్రులు ఎంత చెప్పినా పట్టుంచుకోలేదు. చివరికి మాటా మాటా పెరగడంతో తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. ఇద్దరిని సుత్తితో విచక్షణారహితంగా కొట్టి హత్య చేశాడు. దీంతో తీవ్రగాయాలైన అతని తల్లిదండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఈ దారుణానికి పాల్పడిన తర్వాత హిమాన్షు పారిపోకుండా అక్కడే ఉండిపోయాడు. రాత్రంతా తల్లిదండ్రుల మృతదేహాల మధ్యనే గడిపాడు. ఉదయం తల్లిదండ్రుల మధ్య రక్తపుమడుగుల్లో ఉన్న హిమాన్షును చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. నిందితుడు హిమాన్సును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




