IndiGo Flight: విమానంలో ప్రయాణికుడి మొబైల్ నుంచి మంటలు.. ప్రయాణికుల భయాందోళన
IndiGo Flight: అకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో అప్పుడప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా సాంకేతిక లోపాల కారణంగా..
IndiGo Flight: అకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో అప్పుడప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా సాంకేతిక లోపాల కారణంగా విమానం (Flight)లో మంటలు చెలరేగడం, ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు అత్యవసరంగా ల్యాండ్ చేయడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఈ విమానంలో ప్రయాణించే ప్రయాణికుడి మొబైల్ నుంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మొబైల్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన క్యాబిన్ సిబ్బంది అగ్నిమాపక యంత్రంతో మంటలను ఆర్పివేసినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ వర్గాలు తెలిపాయి. అయితే ఇండిగో సంస్థకు చెందిన 6ఈ 2037 విమానం అసోంలోని దిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు:
ఈ ప్రమాదం విమానంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. విమాన సిబ్బంది కూడా ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, క్షేమంగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికుడి ఫోన్ నుంచి మంటలు, పొగ రావడాన్ని గమనించిన విమాన సిబ్బందిలో ఒకరు వేగంగా స్పందించి అగ్నిమాపక యంత్రం సాయంతో ఆర్పివేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది. విమానం సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
ఇవి కూడా చదవండి: