ఛీ.. ఛీ.. విమానంలో ఇదేం పని..! టాయిలెట్‌కు వెళ్లి డోర్ వేసుకున్న ప్రయాణికుడు.. కాసేపట్లోనే..

ఢిల్లీ నుంచి రియాద్‌కు విమానం బయలుదేరింది.. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు.. టాయిలెట్‌కు వెళ్లి డోర్ వేసుకున్నాడు.. కాసేపట్లోనే డోర్ నుంచి పొగలు రావడాన్ని విమానం సిబ్బంది గుర్తించారు.. తీరా చూస్తే అతను బీడీ తాగినట్లు అర్ధమైంది. చివరకు అధికారులు ఫిర్యాదు చేయడంతో అతన్ని ముంబైలో అరెస్టు చేశారు. వివరాల ప్రకారం..

ఛీ.. ఛీ.. విమానంలో ఇదేం పని..! టాయిలెట్‌కు వెళ్లి డోర్ వేసుకున్న ప్రయాణికుడు.. కాసేపట్లోనే..
Passenger Smokes Beedi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 06, 2024 | 11:18 AM

ఢిల్లీ నుంచి రియాద్‌కు విమానం బయలుదేరింది.. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు.. టాయిలెట్‌కు వెళ్లి డోర్ వేసుకున్నాడు.. కాసేపట్లోనే డోర్ నుంచి పొగలు రావడాన్ని విమానం సిబ్బంది గుర్తించారు.. తీరా చూస్తే అతను బీడీ తాగినట్లు అర్ధమైంది. చివరకు అధికారులు ఫిర్యాదు చేయడంతో అతన్ని ముంబైలో అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి రియాద్‌కు వెళ్లే ఇండిగో విమానంలో లావెటరీలో బీడీ తాగినందుకు 42 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. ఈ విమానం.. ఢిల్లీ నుంచి బయలుదేరి.. ముంబై ఆ తర్వాత రియాద్ కు వెళుతుంది.. ఢిల్లీ, ముంబై- రియాద్ కనెక్టింగ్ ఫ్లైట్ ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత, క్యాబిన్ సిబ్బంది అతన్ని సోమవారం పోలీసులకు అప్పగించారు.

నిందితులు సోమవారం ఢిల్లీ నుంచి విమానంలోకి లైటర్‌, బీడీని తీసుకెళ్లడం చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. నిందితుడు మహ్మద్ ఫక్రుద్దీన్ మహ్మద్ అమ్మురుద్దీన్ గా గుర్తించారు. ఇతను కూలీగా పనిచేస్తున్నాడు. కనెక్టింగ్ ఫ్లైట్‌లో ముంబై మీదుగా రియాద్‌కు వెళ్తున్నాడని పోలీసులు తెలిపారు.

“అమ్మూరుద్దీన్ టాయిలెట్‌కు వెళ్ళిన తర్వాత దాని లావేటరీ మధ్య గాలిలో పొగలు రావడాన్ని విమాన భద్రతా అధికారి గమనించినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది” అని అధికారి తెలిపారు. విమానం ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత, క్యాబిన్ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. పోలీసులకు సమాచారం అందించారని ఆయన చెప్పారు.

సౌదీ అరేబియా రాజధానిలో తాను కూలీగా పనిచేస్తున్నట్లు అమ్మురుద్దీన్ పోలీసులకు చెప్పినట్లు ఎయిర్‌లైన్ సిబ్బంది తెలిపారు.

విచారణ సమయంలో, అతను తన ప్యాంటు జేబుల్లో బీడీ, లైటర్‌ను దాచిపెట్టి.. ఢిల్లీ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకప్‌ నుంచి తప్పించుకున్నట్లు తెలిపాడని పోలీసు అధికారి తెలిపారు.

అమ్మురుద్దీన్‌పై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం), ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంతో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

ఇలాంటి మరో ఘటన అకాసా ఎయిర్‌లైన్‌లో కూడా చోటుచేసుకుంది. అకాసా ఎయిర్‌లైన్‌లో అహ్మదాబాద్ నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్న 56 ఏళ్ల వ్యక్తి.. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చేరుకోగానే లావేటరీలో బీడీ తాగుతున్నాడని ఆరోపిస్తూ అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని మార్వార్ జంక్షన్‌కు చెందిన వ్యక్తి ఎం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి వృత్తి రీత్యా కార్మికుడని.. అరెస్టు అనంతరం బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

నిందితుడు టాయిలెట్‌లో పొగ తాగుతున్నట్లు సిబ్బంది గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగానే ఎయిర్‌లైన్స్ డ్యూటీ మేనేజర్ విజయ్ తుళ్లూరు విమానాశ్రయంలోని పోలీసులకు కుమార్‌పై ఫిర్యాదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..