Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్ రాణా అరెస్టు వ్యవహారం.. మహారాష్ట్ర డీజీపీ, సీఎస్‌లకు పార్లమెంటరీ ప్యానల్ సమన్లు..

ఎంపీ నవనీత్ రాణా.. ముంబైలో తనను అక్రమ అరెస్ట్ చేసి అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ దాఖలు చేసిన ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్యానల్ స్పందించింది.

Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్ రాణా అరెస్టు వ్యవహారం.. మహారాష్ట్ర డీజీపీ, సీఎస్‌లకు పార్లమెంటరీ ప్యానల్ సమన్లు..
Navneet Rana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 08, 2022 | 11:54 AM

Navneet Rana Hanuman Chalisa Row: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠిస్తామని సవాల్‌ విసిరి.. ఎంపీ నవనీత్‌ రాణా దంపతులు జైలు పాలైన విషయం తెలిసిందే. 12 రోజుల జైలు జీవితం అనంతరం ఎంపీ నవనీత్ రాణా, రవి రాణా బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా.. స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా.. ముంబైలో తనను అక్రమ అరెస్ట్ చేసి అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ దాఖలు చేసిన ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్యానల్ స్పందించింది. జూన్ 15న తమ ముందు హాజరుకావాలని లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర అధికారులను సమన్లు​జారీ చేసింది. ఇప్పటికే వివరణ కోరిన ప్యానెల్ తాజాగా.. హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముంబయిలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో తన పట్ల అమానవీయమైన ప్రవర్తించారని, దీంతోపాటు అక్రమ అరెస్టు చేశారని ఎంపీ నవనీత్ రాణా ఫిర్యాదు చేశారు.

కాగా.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత నివాసం ‘మాతోశ్రీ’ వెలుపల హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ప్రకటించిన తర్వాత ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాను ఏప్రిల్ 23న ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ దంపతులు మే 5 న బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత నవనీత్ రాణా మే 23న ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..