PM Modi Speech: పార్లమెంట్‌లో విపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ

18వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత పార్లమెంట్‌ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అయితే సభలో మోడీ ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగిలాయి. మణిపూర్‌ అంశంపై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్‌ భారత్‌ లక్ష్యాల

PM Modi Speech: పార్లమెంట్‌లో విపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ
Pm Modi Speech
Follow us

|

Updated on: Jul 02, 2024 | 5:01 PM

18వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత పార్లమెంట్‌ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అయితే సభలో మోడీ ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగిలాయి. విపక్షాల తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను వెల్‌లోకి పంపడం మంచి పద్దతి కాదని అన్నారు. మణిపూర్‌ అంశంపై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్‌ భారత్‌ లక్ష్యాల గురించి మోడీ వివరించారు.

విపక్షాల తీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని అబద్దాలు చెప్పినా వారికి పరాజయం తప్పలేదన్నారు. ప్రజలు మా పాలన ట్రాక్‌ రికార్డ్‌ చూశారు.. పదేళ్లలో 25 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. పదేళ్లలో భారత్‌ ఖ్యాతి ఎంతో పెరిగిందని మోడీ అన్నారు. అయితే విపక్షాల నిరసనల మధ్యే ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. నేషన్‌ ఫస్ట్‌ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. అవినీతి ఏ మాత్రం సహించకుండా పరిపాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ కోసం ప్రజల ఆశీర్వాదం కోరామని, దేశ ప్రజలు మాపై భరోసా ఉంచారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే క్లీన్‌ స్వీప్‌

మోడీ ప్రసంగంలో ఏపీ ప్రస్తావన తీసుకువచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రజలు తమకు పట్టం కట్టారని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే క్లీన్‌ స్వీప్‌ చేసిందని మోడీ గుర్తు చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజల ప్రేమను పొందామని అన్నారు.

లోక్‌సభలో నిరంతర గందరగోళం మధ్య ప్రధాని మోదీ తన ప్రసంగం కొనసాగించారు. 2014కి ముందు చాలా ఎన్నో కుంభ కోణాలు జరిగాయని, 2014 నాటికి దేశంలో నిరాశా నిస్పృహలు వ్యాపించాయి. గతంలో వార్తాపత్రికల్లో మోసాల వార్తలు వచ్చేవి. గతంలో ఒక్క రూపాయిలో 85 పైసల కుంభకోణం జరిగిందన్నారు. ఈ విషయాలనుప్రజలు బహిరంగంగా ఆమోదించారని, పనులు పూర్తి చేసేందుకు సిఫారసు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 2014కు ముందు దేశంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవని, దేశంలోని ప్రతి మూలను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. అలాంటిది నేడు ఉగ్రవాదాన్ని అరికట్టగలిగామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి