Hathras Stampede: యూపీలో ఘోరం.. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 23 మంది దుర్మరణం..

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో దాదాపు 23 మందికి పైగా మరణించారు. 100మందికి పైగా గాయాలయ్యాయి. భోలే బాబా సత్సంగంలో ఈ తొక్కిసలాట జరిగింది.

Hathras Stampede: యూపీలో ఘోరం.. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 23 మంది దుర్మరణం..
Hathras Stampede
Follow us

|

Updated on: Jul 02, 2024 | 4:44 PM

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో దాదాపు 23 మందికి పైగా మరణించారు. 100మందికి పైగా గాయాలయ్యాయి. భోలే బాబా సత్సంగంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన హత్రాస్ జిల్లా సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని..  సహాయక చర్యలను వేగవంతం చేశారు. సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మృతుల్లో 19మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు, ఒక పురుషుడు ఉన్నారని పేర్కొన్నారు.

పెను విషాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాధ్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

భోలే బాబా సత్సంగం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో తొక్కిసలాట జరిగినట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..