AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Monsoon Session: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న ‘పెగాసస్’ అంశం.. విపక్షాల ఆందోళనతో ఉభయసభలు వాయిదా

pegasus spyware issue: పెగాసస్ స్పైవేర్ వివాదం పార్లమెంటును కుదిపేస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం తొలిరోజే.. పెగాసస్ అంశం సభను కుదిపివేసింది. అయితే.. ఆతర్వాత ఈ వివాదం కాస్త

Parliament Monsoon Session: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న ‘పెగాసస్’ అంశం.. విపక్షాల ఆందోళనతో ఉభయసభలు వాయిదా
Parliament Monsoon Session
Shaik Madar Saheb
|

Updated on: Jul 20, 2021 | 11:31 AM

Share

pegasus spyware issue: పెగాసస్ స్పైవేర్ వివాదం పార్లమెంటును కుదిపేస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం తొలిరోజే.. పెగాసస్ అంశం సభను కుదిపివేసింది. అయితే.. ఆతర్వాత ఈ వివాదం కాస్త మరింత ముదిరింది. దీనిపై అధికార, విపక్ష పార్టీలు తీవ్ర వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో పెగాసస్ స్పైవేర్‌ అంశంపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షపార్టీలన్నీ ఏకమయ్యాయి. ఈ మేరకు పార్లమెంటులో మంగళవారం ఉదయం సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, డీఎంకే, లెఫ్ట్ తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. పెగసస్ అంశాన్ని ఉభయ సభల్లో లేవనెత్తాలని పార్టీల ప్రతినిధులు నిర్ణయించారు. ముఖ్యంగా పెగాసస్ అంశంతోనే పార్టీల ప్రతినిధులు చర్చించినట్లు సమాచారం.

ఇదిలాఉంటే.. రెండోరోజు మంగళవారం ప్రారంభమైన కాసేపటికే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పెగాసస్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయసభలు దద్దరిల్లాయి. దీంతోపాటు రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడగా.. లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వాయిదా పడింది. కాగా.. పెగాసస్ స్పైవేర్‌ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేరు కూడా ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కేంద్రంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేసింది.

ఇదిలాఉంటే.. పెగాసస్‌ ప్రాజెక్టు వ్యవహారంపై రాజ్యసభలో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ జీరో అవర్‌ నోటీసు ఇవ్వగా.. లోక్‌సభలో కాంగ్రెస్ తరపున ఎంపీ మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదిలాఉంటే.. పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సభలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. దీంతోపాటు మధ్యాహ్నం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని కోవిడ్ పరిస్థితులపై, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

Also Read:

TDP MLA Atchannaidu: ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి సభాహక్కుల సంఘం నోటీసులు.. వ్యక్తిగతంగా హాజరై, వివరణ కోరే అవకాశం!

NIA Raids: తెలంగాణలో ఎన్‌ఐఏ కలకలం.. 5 జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు… భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం!