
Pappan Singh Gahlot: తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఇబ్బందులు పడుతుంటే.. మాకు ఏముందంటూ సాయం చేయడానికి ఆలోచించేవారు కొందరు అయితే.. తమకు ఉన్నదానితోనే కష్టంలో ఉన్నవారికి చేయూత అందించేవారు ఇంకొందరు. తమ చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకునే మంచి మనిషి.. కరోనా లాక్ డౌన్ సమయంలో మానవత్వంతో స్పందించిన గొప్ప వ్యక్తి.. తన వద్ద పనిచేసే కూలీలను విమానం ఎక్కించి ఇంటికి పంపించి యావత్ దేశ ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్న పుట్టగొడు రైతు.. 55 ఏళ్ల ‘పప్పన్ సింగ్ గెహ్లాట్’ ఇక లేరు.
2020 కోవిడ్ లాక్‌డౌన్ సంక్షోభం సమయంలో తన వద్ద పనిచేస్తున్న కార్మికులను విమానంలో బీహార్‌కు పంపిన పప్పన్ సింగ్ గెహ్లాట్ బుధవారం ఢిల్లీలోని ఒక ఆలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలీపూర్‌లోని గెహ్లాట్ ఇంటి ముందు ఉన్న పగోడాలో ఫ్యాన్‌కు వేలాడుతూ అతని మృతదేహం వేలాడుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. తాను ఆత్మహత్య చేసుకోవాడానికి కారణం తన అనారోగ్యమే అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు గెహ్లాట్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి తదుపరి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
గెహ్లాట్ దాతృత్వం దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రశంసించబడింది.
పప్పన్ సింగ్ గెహ్లాట్ ఎప్పుడూ ఉత్సాహంగా.. సంతోషంగా కనిపించేవారు. పుట్టగొడుగులు సాగు చేసిన పప్పన్త వద్ద పనిచేసే కూలీలను ఎంతో ప్రేమగా చూసేవారని పేర్కొన్నారు. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో లాక్డౌన్ విధించిన సమయంలో వేలాది మంది వలస కూలీలు ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో.. గెహ్లాట్ తన వద్ద పనిచేస్తున్న కార్మికులను ఇంటికి తిరిగి పంపడానికి విమాన టిక్కెట్లను కొనుగోలు చేశాడు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత తన వద్ద పని చేస్తున్న కార్మికులను తిరిగి రావడానికి టిక్కెట్లు కూడా కొనుగోలు చేశాడు.
“उम्मीद कभी नहीं छोड़ना चाहिये, क्योंकि जीवन में चमत्कार होना कोई नई बात नही है…”
जय श्री राम?— Pappan singh gahlot (@GahlotPappan) May 12, 2022
గెహ్లాట్ ఒకసారి ట్వీట్ చేశారు, “ఎప్పటికీ ఆశ వదులుకోకూడదు, ఎందుకంటే జీవితంలో అద్భుతాలు జరగడం కొత్తేమీ కాదు.” చేసిన ట్విట్ ని గుర్తు చేసుకుంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..