తమిళనాట హీట్ పెంచిన పన్నీర్ సెల్వం ట్వీట్
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా అధికార పార్టీ అన్నాడీఎంకేలో పళని స్వామి, పన్నీర్ సెల్వం మధ్య
Pannerselvam tweet Tamil Nadu: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా అధికార పార్టీ అన్నాడీఎంకేలో పళని స్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్యపోరు బాగా కనిపిస్తోంది. ఈ క్రమంలో సోమవారం డిప్యూటీ సీఎం పన్నీర్ చేసిన ట్వీట్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. భగవద్గీతలోని సూక్తులను గుర్తు చేస్తూ పన్నీర్ ట్వీట్ చేశారు.
తమిళనాడు ప్రజలు, ఏఐడీఎంకే వాలంటీర్ల అభిష్టానికి అనుగుణంగా నా నిర్ణయాలు ఉంటాయి. ఇప్పటికీ దాన్నే అనుసరిస్తా అని ట్వీట్ పెట్టిన పన్నీర్.. ‘ఏది జరిగిందో అది బాగానే జరిగింది..ఏది జరుగుతుందో అది కూడా బాగానే జరుగుతుంది. అలాగే ఏది జరగబోతుందో అది కూడా బాగానే ఉంటుంది’ అని వేదాంతం చెప్పుకొచ్చారు. కాగా ఈ నెల 7న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ప్రకటనతో ప్రస్తుతమున్న కుర్చీ కొట్లాటకు ముగింపు పలకాలని పార్టీ భావిస్తోంది. అయితే పన్నీర్ సెల్వం గత మూడు రోజులుగా తేనిలో ఉండి, చెన్నైకి తిరుగు పయనమయ్యారు. మరోవైపు మంత్రులు జయకుమార్, ఆర్‌బీ ఉదయకుమార్, కేటీ రాజేంద్ర బాలాజీ, వెల్లమండి నటరాజన్‌లు సీఎం పళనిస్వామితో భేటీ కావడం గమనార్హం.
Read More: