పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్ , బోర్డర్ ఫోర్స్ కాల్పులతో తిరిగి మళ్ళిన ‘నిఘా సాధనం’ !

పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ ఒకటి ఆదివారం భారత సరిహద్దుల్లోకి  ప్రవేశించింది. అయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమై కాల్పులు జరపడంతో వెంటనే అది తిరిగి పాక్ వైపు వెళ్ళిపోయింది.

పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్ , బోర్డర్ ఫోర్స్ కాల్పులతో తిరిగి మళ్ళిన 'నిఘా సాధనం' !
Drones
Follow us

| Edited By: Phani CH

Updated on: Mar 14, 2021 | 8:25 PM

పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ ఒకటి ఆదివారం భారత సరిహద్దుల్లోకి  ప్రవేశించింది. అయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమై కాల్పులు జరపడంతో వెంటనే అది తిరిగి పాక్ వైపు వెళ్ళిపోయింది. పంజాబ్ పఠాన్ కోట్ జిల్లా సమీపంలోని దిండా  పోస్ట్ వద్ద భారత-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ డ్రోన్ ని కనుగొన్నారు. భారత భూభాగంలోకి ఇది ఏమైనా జార విడిచిందా అని ప్రశ్నించగా..ఇప్పుడే ఈ విషయాన్నీ స్పష్టం చేయలేమని,  క్షుణ్ణంగా గాలిస్తున్నామని, కానీ ఏమీ కనబడలేదని ఈ ఫోర్స్ అధికారులు చెప్పారు. గత ఏడాది  డిసెంబరులో పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా సమీపంలో.. పాకిస్తాన్ కి చెందిన డ్రోన్  11 హ్యాండ్ గ్రెనేడ్లను జార విడిచింది. ఒక పొలంలో వీటిని కనుగొన్నారు.ఓ నైలాన్ తాడుతో వీటిని జారవిడిచిందని అధికారులు గుర్తు చేశారు. అయితే వెంటనే వాటిని తీసుకువెళ్లి నిర్వీర్యం చేసినట్టు వారు చెప్పారు.

2019 సెప్టెంబరులో లోకూడా పాక్ డ్రోన్  రెండు పిస్టల్స్ ని కొన్ని మందుగుండు తూటాలను తరన్ తరన్ జిల్లాలో జారవిడిచింది. అందులో కొన్ని ఫేక్ కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయి. కాగా తాజా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. మరిన్ని చదవండి ఇక్కడ : సింహం ప్రాంక్ వీడియో వైరల్.. నిజం తెలిసి నవ్వులే నవ్వులు..! Viral Video

పొట్టేలుతో సెల్ఫీ కోసం ట్రై చేసిన యువతికి మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చింది వైరల్ గా మారిన వీడియో : Girl selfie With Goat

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో