AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీపై 12 అభియోగాలతో అస్సాం కాంగ్రెస్ ‘ఛార్జ్ షీట్’, కొట్టిపారేసిన కమలనాథులు

అస్సాం ఎన్నికలు సమీపిస్తుండగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. బీజేపీపై 12 పాయింట్లతో ఓ 'ఛార్జ్ షీట్' రూపొందించి విడుదల చేసింది. రాష్ట్రంలో ఈ 12 అంశాలకు సంబంధించి...

బీజేపీపై  12 అభియోగాలతో అస్సాం కాంగ్రెస్ 'ఛార్జ్ షీట్',  కొట్టిపారేసిన కమలనాథులు
Assam Congress Releases 12 Point Chrgesheet On Bjp
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 14, 2021 | 8:44 PM

Share

అస్సాం ఎన్నికలు సమీపిస్తుండగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. బీజేపీపై 12 పాయింట్లతో ఓ ‘ఛార్జ్ షీట్’ రూపొందించి విడుదల చేసింది. రాష్ట్రంలో ఈ 12 అంశాలకు సంబంధించి…  ప్రజాసంక్షేమ చర్యల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ఈ నెల 27 నుంచి మూడు దశల్లో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  కమ్యూనిటీ, ల్యాండ్, బేస్ అన్న మూడు అంశాల్లో ప్రజలకు బీజేపీ హామీ ఇఛ్చినా దాన్ని నెరవేర్చలేదని, అలాగే ఎన్ ఆర్ సీ ని అమలు చేస్తామని వాగ్దానం చేసినా ఆది కూడా మూలన పడిందని, నిజానికి దీన్ని మొదట తామే అమలులోకి తెచ్చ్చామని వివరించింది. దీనివల్ల విదేశీయులను గుర్తించవచ్చు అని పేర్కొంది. ప్రతి ఏడాదీ 5 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని కూడా ఆశ చూపినా అది కూడా నెరవేరలేదని అస్సాం కాంగ్రెస్ పేర్కొంది. ఇక్కడ సిండికేట్    రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టింది. కానీ సీఏఎ  (పౌరసత్వసవరణ చట్టం) అంటే ఈ పార్టీకి అసలు తెలియడంలేదని బీజేపీ కొట్టి పారేసింది. అసలు ఈ ఛార్జ్ షీట్ వట్టి జోక్ అని అభివర్ణించింది.  మా విధానాల గురించి ప్రజలకు తెలుసునని, కానీ ఈ ఛార్జ్ షీట్ వట్టి అబధ్ధాల పుట్ట అని పేర్కొంది.

పౌరసత్వ సవరణ చట్టంపై వీరి వైఖరి ఏమిటో అర్థం కావడం లేదని, ఎన్నికల ముందు ఏదో విధంగా ప్రజలను తప్పుదారి పట్టించడానికి కాంగ్రెస్ యత్నిస్తోందని బీజేపీ దుయ్యబట్టింది.  కాగా అస్సాంలో ఎన్నికల ప్రచారం ఇంకా పుంజుకోవాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి ఇక్కడ ఎన్నికలు జరగ వలసి ఉన్నా కేంద్ర నేతలు ఇంకా ఈ రాష్ట్రంపై దృష్టి నిలపలేదు. అయితే రానున్నరోజుల్లో హోమ్ మంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ఈ రాష్ట్రాన్ని విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి .

మరిన్ని చదవండి ఇక్కడ :  సింహం ప్రాంక్ వీడియో వైరల్.. నిజం తెలిసి నవ్వులే నవ్వులు..! Viral Video

పొట్టేలుతో సెల్ఫీ కోసం ట్రై చేసిన యువతికి మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చింది వైరల్ గా మారిన వీడియో : Girl selfie With Goat