ఇక వీళ్ళ పని ఖతమేనా ? ఆస్తుల స్వాధీనం, బ్యాంకు ఖాతాల స్తంభన

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడని పాకిస్తాన్ ఇన్నాళ్లకు అంగీకరించింది. బ్యాన్ చేసిన 88 ఉగ్రవాద జాబితాలో దావూద్ కరాచీ అడ్రస్ కూడా ఉందని..

ఇక వీళ్ళ పని ఖతమేనా ? ఆస్తుల స్వాధీనం, బ్యాంకు ఖాతాల స్తంభన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 22, 2020 | 7:55 PM

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడని పాకిస్తాన్ ఇన్నాళ్లకు అంగీకరించింది. బ్యాన్ చేసిన 88 ఉగ్రవాద జాబితాలో దావూద్ కరాచీ అడ్రస్ కూడా ఉందని పాక్ ప్రభుత్వం పేర్కొంది. ఈ గ్రూపులను, వీటి లీడర్లపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్నామని, వీరి స్థిర, చరాస్థులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, వారి బ్యాంకు ఖాతాలను సైతం స్తంభింపజేస్తామని స్పష్టం చేసింది. వీరిలో దావూద్ తో బాటు కరడు  గట్టిన ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటివారు కూడా ఉన్నారు. ప్యారిస్ లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రెండేళ్ల క్రితమే పాకిస్థాన్ ను గ్రే లిస్టులో ఉంచింది. 2019 కల్లా ఈ టెర్రరిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బ్లాక్ లిస్టులో ఉంచే అవకాశాలు ఉన్నాయని ఆ టాస్క్ ఫోర్స్ హెచ్ఛరించింది. అయితే కోవిడ్ కారణంగా ఈ డెడ్ లైన్ కాల పరిమితి ముగిసింది.

మసూద్ అజహర్, దావూద్ ఇబ్రహీం లపై ఆంక్షలు విధిస్తు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నెల 18 న రెండు నోటిఫికేషన్లను జారీ చేసింది. అయితే ఇదంతా ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టించడానికేనా  అన్న అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.