కరోనా టెస్టుల్లో భారత్ అరుదైన రికార్డు..
కరోనా టెస్ట్‌ల విషయంలో భారత్ అరుదైన మైలురాయిని దాటింది. ఒక్కరోజే 10 లక్షలకు పైగా కోవిడ్ టెస్ట్‌లు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. శుక్రవారం ఒక్కరోజే 10 లక్షల 23,386 మందికి దేశవ్యాప్తంగా కరోనా టెస్ట్‌లు చేశారు.

Corona Tests India: కరోనా టెస్ట్‌ల విషయంలో భారత్ అరుదైన మైలురాయిని దాటింది. ఒక్కరోజే 10 లక్షలకు పైగా కోవిడ్ టెస్ట్‌లు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. శుక్రవారం ఒక్కరోజే 10 లక్షల 23,386 మందికి దేశవ్యాప్తంగా కరోనా టెస్ట్‌లు చేశారు. అనేక రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు టెస్ట్‌ల సంఖ్యను వేగంగా పెంచడంతో ఇది సాధ్యమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3 కోట్ల 40 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
టెస్ట్‌ల సంఖ్యను పెంచిన తొలిరోజుల్లో పాజిటివ్ సంఖ్య పెరిగినప్పటికి , క్రమంగా ఇది తగ్గుముఖం పట్టినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌కు ఇది చాలా ముఖ్యమని తెలిపింది. ఒక్కరోజులో 10 లక్షల కరోనా టెస్ట్‌లు చేయడం అరుదైన రికార్డని ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్యను కూడా పెంచినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో 1511 ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారు. 983 ప్రభుత్వ ల్యాబ్‌లు కాగా 528 ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా టెస్ట్‌లు చేస్తున్నారు. కాగా, శుక్రవారం ఒక్కరోజే భారత్‌లో 69874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకు 29 లక్షల 75 వేల 701 కరోనా కేసులు నమోదయ్యాయి. 55794 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.




