‘కరోనా కాన్ఫరెన్స్’ లో కాశ్మీర్ అంశం.. పాకిస్తాన్ నిర్వాకం

కరోనా భయంతో ఓ వైపు ప్రపంచ దేశాలు గడగడలాడుతున్న తరుణంలో..దీన్ని సమష్టిగా ఎదుర్కొందామని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సార్క్ సభ్యదేశాలకు పిలుపు నిచ్చారు. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు ఇండియా తరఫున 10 మిలియన్

'కరోనా కాన్ఫరెన్స్' లో కాశ్మీర్ అంశం.. పాకిస్తాన్ నిర్వాకం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 16, 2020 | 1:47 PM

కరోనా భయంతో ఓ వైపు ప్రపంచ దేశాలు గడగడలాడుతున్న తరుణంలో..దీన్ని సమష్టిగా ఎదుర్కొందామని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సార్క్ సభ్యదేశాలకు పిలుపు నిచ్చారు. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు ఇండియా తరఫున 10 మిలియన్  యుఎస్ డాలర్ల విరాళాన్ని ఫండ్ గా ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇతర దేశాలు కూడా ఈ విధమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆయన కోరారు. అయితే ఈ సందర్భాన్ని పాకిస్తాన్.. కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు వినియోగించుకుంది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా వెంటనే జమ్మూకాశ్మీర్లో ఆంక్షలను ఎత్తి వేయాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పెషల్ అసిస్టెంట్ మీర్జా డిమాండ్ చేశారు. కాశ్మీర్లో సైతం కరోనా కేసులు బయటపడ్డాయని, అందువల్ల హెల్త్ ఎమర్జన్సీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలన్నారు. అక్కడ కమ్యూనికేషన్ సౌకర్యాలను పునరుధ్దరించాలని, వైద్య పరికరాలు, సాధనాల పంపిణీకి అనుమతించాలని ఆయన కోరారు. అయితే పాక్ చర్య బాల్య చేష్టగా ఉందని, కాశ్మీర్ వంటి అంశాన్ని లేవనెత్తడం ద్వారా ఈ వీడియో కాన్ఫరెన్సును రాజకీయం చేయాలనుకున్నదని ప్రభుత్వ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి.

ఇలా ఉండగా.. కోవిడ్-19 ని ఎదుర్కోవడానికి అనువుగా తాము  ఎమర్జెన్సీ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు సార్క్ సభ్యదేశాలన్నీ స్వచ్చందంగా విరాళాలు ఇవ్వాలని మోదీ కోరారు.  భారత్ తరఫున 10 మిలియన్ డాలర్లను ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా నివారణకు ఈ విరాళాన్ని వ్యయం చేయవచ్చునన్నారు. కాగా…  శ్రీలంక, భూటాన్, మాల్దీవులు,  బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ దేశాధినేతలు.. కరోనాపై సమిష్టి పోరాటానికి తాము సిధ్ధమని ప్రకటించారు.   మోదీ చొరవను వారు ప్రశంసించారు.